Whatsapp New Features : వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చదువుకున్నవాళ్లు అయినా.. చదువుకోని వాళ్లు అయినా.. ఎవ్వరైనా సరే.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వాట్సప్ సుపరిచితమే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే.. చాలు.. దానిలో వాట్సాప్ ఉండి తీరాల్సిందే. ఆ రేంజ్ లో ప్రజలంతా వాట్సాప్ కి కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ టూల్ లాగా వాట్సాప్ ని వినియోగించినంతగా మరే ఇతర అప్లికేషన్ ని అంతలా వినియోగించడం లేదు.
అందుకోసమే యూజర్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ తో మెటా యాజమాన్యం ముందుకొస్తూనే ఉంటుంది. ఆలానే అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు యూజర్ ఫీడ్ బ్యాక్ తీసుకొని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో మూడు కొత్త ఫీచర్లను వాట్సాప్ లోకి తీసుకొచ్చారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
పోలింగ్ (Whatsapp New Features)..
ఈ ఫీచర్ ని వాట్సాప్ 2022 నవంబర్‌లోనే లాంచ్ చేసింది. అయితే తాజా అప్‌డేట్‌లో క్రియేట్ సింగిల్ ఓట్ పోల్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ చాట్స్, పోల్ రిజల్ట్ ను కొత్తగా తీసుకొచ్చింది.
క్రియేట్ సింగిల్ ఓట్ పోల్ : అది ఎలా అంటే.. ప్రస్తుతం వాట్సాప్ పోల్స్ లో యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ సార్లు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేయవచ్చు. దీని వల్ల పోల్స్ ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండటం లేదని ఎక్కువ మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు క్రియేట్ సింగిల్ ఓట్ పోల్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. దీంతో పోల్ లో పాల్గొనే వారు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు.
సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ చాట్స్ : ఏదైనా గ్రూప్ లో పోల్ నిర్వహించినప్పుడు తర్వాత ఓటు వేద్దామని మర్చిపోతే తర్వాత గ్రూప్ లో వచ్చిన మెసేజ్‌లతో పోల్ ఎక్కడ ఉందనేది వెతకడం కష్టంగా మారుతుంది. ఆ సందర్భంలో పోల్‌ను గుర్తించేందుకు సెర్చ్ ఆప్షనలోకి వెళ్లి “polls” అని టైప్ చేస్తే మొత్తం పోల్స్ జాబితా చూపిస్తుంది.
పోల్ రిజల్ట్ : ఈ ఫీచర్‌తో యూజర్లు తాము నిర్వహించే పోల్స్‌లో ఎవరు ఓటు వేసినా.. వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దీంతో ఎవరు, ఎప్పుడు ఓటు వేశారో తెలుసుకోవచ్చు.