Site icon Prime9

Instagram : ఇంస్టాగ్రామ్ కొత్త రూల్స్ ఇవే !

instagram new update prime9news

instagram new update prime9news

Instagram : ఇండియాలోని ఇంస్టాగ్రామ్ యూజర్లకు కొత్త షాక్.ఇంస్టాగ్రామ్ వాడే వాళ్ళు ఎవరైనా ఇక నుంచి ఈ రూల్స్ పాటించాలిసిందే అంటున్న ఇన్‌స్టాగ్రామ్.ఈ ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించాలంటే ఇక నుంచి వయస్సును కూడా ధృవీకరించాలి.యూజర్లు తమ వయస్సును వెరిఫై చేసే ఫీచర్‌ను భారతదేశంతో పాటు బ్రెజిల్లో కూడా ప్రారంభిస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది.మెటా యాజమాన్యంలోని వీడియో, ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్, టీనేజ్ యూజర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.ఈ విమర్శల నేపథ్యంలో వయస్సును ధృవీకరించే ఫీచర్‌ను ఇండియా, బ్రెజిల్‌లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసిన సమాచారం.

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో వయస్సు వెరిఫికేషన్ చేసే ఫీచర్ 2022 జూన్‌లో అమెరికాలో మొదటిసారి అమలులోకి వచ్చింది.యూజర్లు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం లేదా ఫోటో ఐడీని అప్‌లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును కూడా ధృవీకరించాలి.18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పుట్టిన తేదీని మార్చడానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే ఈ వెరీఫికేషన్ చేయాలిసిందే.

ఈ టెక్నాలజీతో వయస్సు తప్ప ఇతర ఐడెంటిటీ ఏదీ గుర్తించదని మెటా ఇప్పటికే స్పష్టం చేసింది.ఇక ఫోటో ఐడీ ఆప్షన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ పలు ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ను స్వీకరిస్తుంది.ఆ డాక్యుమెంట్స్‌ ఏంటంటే బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి.

Exit mobile version