Site icon Prime9

Best Mobile Offers: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా?.. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ చూసుండరు..!

Motorola G45 5G

Motorola G45 5G

Best Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో 15000 రూపాయల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చయొచ్చు. ఇప్పుడు మోటరోలా, రియల్‌మి, ఒప్పో బ్రాండెడ్ ఫోన్లు ఆఫర్లపై తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ఫోన్‌లపై బలమైన బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్లను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా ఆర్డర్ చేయచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు తగ్గింపు అనేది కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. Motorola G45 5G
ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నధర రూ.12,999. ఈ సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ. 1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.12,450 వరకు ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందిస్తోంది. దీని సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్స్. ఫోన్‌ను పవర్ చేయడానికి 5000mAh బ్యాటరీ ఉంది.

2. OPPO K12x 5G
ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ధర రూ.12,999. ఈ ఫోన్‌ను రూ. 1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. అయితే మీరు క్యాష్‌బ్యాక్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 12,450 వరకు ప్రయోజనం పొందుతారు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లేను ఇస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందిస్తుంది. సెల్ఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

3. Realme 12x 5G
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ రూ.13,499కి అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ. 12,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. రియల్‌మి ఈ ఫోన్‌లో కంపెనీ 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను ఇస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ప్రాసెసర్‌గా మీరు ఈ ఫోన్‌లో డైమెన్షన్ 6100+ చిప్‌సెట్ పొందుతారు.

Exit mobile version