Site icon Prime9

Honor X9c: హానర్ నుంచి కొత్త ఫోన్.. క్రేజీ ఫీచర్స్‌తో లాంచ్..!

Honor X9c

Honor X9c

Honor X9c: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త హ్యాండ్‌సెట్ Honor X9cని స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC, IP65M రేటింగ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయిన Honor X9bకి సక్సెసర్. కంపెనీ తన కొత్త ఫోన్‌లో పెద్ద 6,600mAh బ్యాటరీని చేర్చింది. ఇది 66W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు ఇందులో అనేక ఇతర తాజా ఫీచర్లను కూడా పొందుతున్నారు. దీని ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియాలో మాత్రమే అందుబాటులో ఉంది. దాని 12GB/256Gb వేరియంట్ ధర MYR 1,499 అంటే (సుమారు రూ. 26,700). అయితే, దాని 12GB/512GB వేరియంట్ ధర MYR 1,699 అంటే (సుమారు రూ. 32,500). దాని 8GB/256GB వేరియంట్ గ్లోబల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది, అయితే ధర ఇంకా వెల్లడి కాలేదు.

ఈ హానర్ ఫోన్‌లో మీరు 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందుతారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్, ఐ ప్రొటక్షన్ ఫీచర్లతో వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీనిలో గరిష్టంగా 12GB RAM+ 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ Android 14-ఆధారంగా MagicOS 8.0లో రన్ అవుతుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఇది OISతో 108MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. అయితే సెల్ఫీ కోసం ఇది 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్ 2 మీటర్ల నీటిలో కూడా సురక్షితంగా ఉంటుంది. ఇది డస్ట్ 360-డిగ్రీల వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65M రేటింగ్‌ను పొందింది.

పవర్ కోసం ఫోన్‌లో 6,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో ఓటీజీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, డ్యూయల్ 5జీ, 4Gజీ LTE, Wi-Fi, బ్లూటూత్ 5.1 వంటి ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version