Site icon Prime9

HMD Fusion Mobile Offers: భారీగా తగ్గిన హెచ్ఎమ్‌డీ ఫ్యూజన్ ధర.. ఈ ఫోన్ బట్టలు మార్చేయచ్చు.. అమెజాన్ ఆఫర్ అదిరింది..!

HMD Fusion Mobile Offers

HMD Fusion Mobile Offers: HMD గ్లోబల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్ఎమ్‌డీ ఫ్యూజన్ మోడల్‌పై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌తో ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 15,000కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్  గత సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని హైలైట్ ఫీచర్ స్మార్ట్ అవుట్ ఫిట్ సిస్టమ్.  కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి.

ఈ కొత్త HMD ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ డివైజ్ గత సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని తరువాత గత డిసెంబర్‌లో భారతీయ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ HMD ఫ్యూజన్ ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు ఏమిటంటే ఇది ఒక ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్, ఇది 1 బాడీతో 6 విభిన్న బ్యాక్ ప్యానెల్‌లను కలిగి ఉన్నట్లు వెల్లడైంది.

దీని హైలైట్ ఫీచర్ స్మార్ట్ అవుట్ ఫిట్ సిస్టమ్. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లపై కంపెనీ 6 పిన్ కనెక్టర్‌ను అందించింది. దీనితో ప్రతి వినియోగదారు తమకు నచ్చిన బ్యాక్ ప్యానెల్ స్కిన్లను విడిగా కొనుగోలు చేయవచ్చు. ఇందులో గేమింగ్ అవుట్‌ఫిట్ ప్యానెల్ ఉంది. ఇది గేమర్స్ కోసం.

ఇది కాకుండా కెమెరా-సర్క్లింగ్ LED లైట్‌తో కూడిన ఫ్లాషీ అవుట్‌ఫిట్ కూడా అందుబాటులో ఉంది. తదుపరి ఇది రగ్డ్ అవుట్‌ఫిట్, క్యాజువల్ అవుట్‌ఫిట్ అని పిలువబడే అనేక ప్యానెల్‌లను అందిస్తుంది. కొత్త HMD ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్  6.56″ అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

మొబైల్ 8GB RAMతో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 128GB వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనపు నిల్వ ఎంపిక కోసం వినియోగదారులు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా గరిష్టంగా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది.

ఇందులో 108MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇది ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.ఈ కొత్త HMD ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో ఆధారితమైనది.

భారతీయ మార్కెట్లో ఈ కొత్త HMD ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 22,999. అమెజాన్ ఇండియాలో ఇప్పుడు కొనసాగుతున్న ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఫోన్‌పై దాదాపు 22శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 17,999 తగ్గింది. దీనితో పాటు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్ ధర రూ. 2000 వరకు తగ్గుతుంది. ఇప్పుడు HMD Fusion ఫోన్‌ను కేవలం రూ. 15,999కి కొనుగోలు చేయచ్చు.

Exit mobile version
Skip to toolbar