Site icon Prime9

Google play apps: ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

tech prime9news

tech prime9news

Google play apps Removed:  ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు ఉన్న కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తుంటుంది. నిబంధనలకు అనుగుణంగా లేని యాప్స్‌ను కూడా గుర్తిస్తూ తొలగిస్తుంటుంది. ఐతే తాజాగా యాడ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్న కొన్ని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ డిలీట్ చేసిందని ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. యాడ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్న యూజర్ల ఫోన్‌లోని బ్యాటరీని, డేటాను వేస్ట్ చేస్తున్నందున ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ తొలగించిందని వెల్లడించింది. యూజర్ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా వెబ్ పేజెస్ ఓపెన్ చేసి యాడ్స్‌ పై క్లిక్ చేస్తున్నట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న 16 యాప్స్‌ను తీసేసిందని పేర్కొన్నారు. ఆ యాప్స్ ఏంటో మీరు కూడా చూడండి. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసుకోండి.

మెకేఫే గుర్తించిన 16 యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని ఆర్స్ టెక్నికా రిపోర్ట్ వెల్లడించింది. ఇంతకు ముందు వరకు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్ కోసం ఈ యాప్స్ మనకి అందుబాటులో ఉండేవి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు, టార్చ్ ఫ్లాష్‌లా వాడేందుకు, మెజర్‌మెంట్ యాప్స్‌గా ఈ అప్లికేషన్స్‌గా లిస్ట్ అయి ఉండేవి. తొలగించిన యాప్స్ ఇవే

ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించిన యాప్స్..

ఈజెడ్ నోట్స్, మెమోక్యాలెండర్, ఫ్లాష్‌లైట్, క్యాల్‌కల్, బుసాన్‌బస్, జాయ్‌కోడ్, కరెన్సీ కన్వర్టర్, హైస్పీడ్ కెమెరా, స్మార్ట్ టాస్క్ మెనేజర్, ఫ్లాష్‌లైట్+, కే-డిక్షనరీ, క్విక్ నోట్, ఈజెడ్‌డికా, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్‌లోడర్.

Exit mobile version