Google Pixel Tablet: గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌ వివరాలు ఇవే..

గూగుల్ మన ముందుకు కొత్త గాడ్జెట్ ను తీసుకురానుంది. పిక్సెల్ లైనప్‌లో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ టెస్టింగ్ కోసం కొత్త మోడల్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసిన సమాచారం.

  • Written By:
  • Publish Date - September 24, 2022 / 11:10 AM IST

Google Pixel Tablet Specifications: గూగుల్ మన ముందుకు కొత్త గాడ్జెట్ ను తీసుకురానుంది. పిక్సెల్ లైనప్‌లో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ టెస్టింగ్ కోసం కొత్త మోడల్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసిన సమాచారం. ఇంజినీరింగ్ వాలిడేషన్ టెస్ట్ కోసం ఇండియాకు పిక్సెల్ ట్యాబ్లెట్‌ను పంపిందని తెలుస్తుంది. సర్టిఫికేషన్ కోసం గూగుల్, ఈ పిక్సెల్ ట్యాబ్లెట్‌లను భారత్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇండియాలో ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్ విడుదల చేయడం ఖాయంమని తెలుస్తుంది. ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌కు స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి.

2023లో పిక్సెల్ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేస్తామని 2022 జూలైలో జరిగిన I/O డెవలర్స్ ప్రోగ్రాంలో గూగుల్ ప్రకటించింది. వచ్చే నెల అనగా అక్టోబర్‌ 6వ జరిగే ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్, పిక్సెల్ వాచ్‌ ను గూగుల్ లాంచ్ చేయనున్నట్లు తెలిసిన సమాచారం.

గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్లు..

గూగుల్ సొంత ప్రాసెసర్‌ టెన్సార్ ఈ పిక్సెల్ ట్యాబ్లెట్‌లో అమరి ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ టెన్సార్‌ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్‌ను తీసుకురావాలని గూగుల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం 10.95 ఇంచుల display ఈ పిక్సెల్ ట్యాబ్లెట్ కలిగి ఉందని తెలిసింది. ఈ ట్యాబ్లెట్‌ USI 2.0 స్టైలస్‌కు సపోర్ట్ చేస్తుంది. 128gb స్టోరేజ్, 256gb స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ట్యాబ్ మన ముందుకు రానుంది.