Site icon Prime9

Google Pixel 9a: అవాక్కయ్యారా మిత్రమా.. గూగుల్ నుంచి మైండ్ బ్లోయింగ్ మొబైల్.. ఫీచర్లు చూసేయండి..!

Google Pixel 9a

Google Pixel 9a

Google Pixel 9a: గూగుల్ సంస్థ కొత్త మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు కూడా ఈ ఫోన్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. Google Pixel 9a మార్చి 2025 నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా సమయం మిగిలి ఉండగా ఫోన్ స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ Google Pixel 8A కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్‌ల నుంచి మరింత విభిన్నంగా Google Pixel 9aని కంపెనీ పరిచయం చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పటికే లీక్ అయింది. నివేదిక ప్రకారం గూగుల్ పిక్సెల్ 9ఎ ధర రూ. 41,938.95గా అంచనా వేస్తున్నారు. ఇది గూగుల్ పిక్సెల్ 8ఎ ధరకు సమానంగా ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ 8 జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 52,999కి ప్రారంభించారు. ఫోన్  8జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 59,999కి విడుదలైంది.

Google Pixel 9a Features
గుగుల్ పిక్సెల్ 9ఎ మొబైల్‌లో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది పిక్సెల్ 8a ఫోన్ కంటే 0.2 అంగుళాలు పెద్దది. ఫోన్ గూగుల్ పిక్సెల్ 9,  పిక్సెల్ 9 ప్రో మాదిరిగానే ఉంటుంది. డిస్‌ప్లే 60-120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో గూగుల్ పిక్సెల్ 9ఎని లాంచ్ చేస్తుంది. ఇది గూగుల్ పిక్సెల్ 9 ఫోన్‌ల మాదిరిగానే ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌లో 8జీబీ ర్యామ్+ 128, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

రాబోయే కొత్త మొబైల్‌లో గూగుల్ పిక్సెల్ ప్రో ఫోల్డ్ మాదిరిగానే కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని అంటున్నారు. అయితే గూగుల్ పిక్సెల్ 8ఎ మొబైల్‌లో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సమాచారం ప్రకారం పిక్సెల్ 9ఎ మొబైల్ 5,000ఎమ్ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది పిక్సెల్ 8ఎ ఫోన్‌లోని 4,492ఎమ్ఏహెచ్ బ్యాటరీ కంటే 11.31 శాతం ఎక్కువ. గూగుల్ పిక్సెల్ XL మరింత పెద్ద 5,060mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 18 వాట్స్ వైర్డ్, 7.5 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది కంపెనీపెద్ద మోడళ్ల కంటే చిన్నదిగా కనిపిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ పెద్ద డిస్‌ప్లే ఉన్నప్పటికీ పిక్సెల్ 8ఎ మొబైల్ ఫోన్‌కు భిన్నంగా ఉండవచ్చు. ఇది 8.9 mm మందం, 2 గ్రాముల (186g) బరువు తక్కువగా ఉంటుంది. ఇది గూగుల్ పిక్సెల్ సిరీస్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్ 8ఎ మొబైల్ IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ 1.5 మీటర్ల లోతైన నీటిలో 30 నిమిషాల పాటు ఉండగలదు.

Exit mobile version