Google Maps New AI Features: గూగుల్ మ్యాప్స్ తెలియని వారుండరు. మన దిన చర్యలో ఉపయోగించే స్మార్ట్ యాప్స్ అన్నీ కూడా దీని ఆధారంగానే పనిచేస్తుంటారు. కోట్ల మంది ప్రజలు ప్రతి నెలా దీన్ని ఉపయోగిస్తుంటారు. గూగుల్ ఇప్పుడు దీనికి ఏఐ ఫీచర్లను జోడించింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మిరింత తెలివిగా వ్యవహరించనుంది. నావిగేషన్, ప్లానింగ్, సెర్చ్‌ను గతంలో కంటే సులభతరం చేస్తుంది. వినియోగదారులు కొత్త స్థలాలను ఐడెంటిఫై చేయడం, మంచి మార్గాలను చూపడం, ఖచ్చితమైన మార్గదర్శకాలతో నావిగేట్ చేయడంలో సహాయం చేయడానికి గూగుల్ ఇప్పుడు “జెమిని” ఏఐ మోడల్‌ని ఉపయోగిస్తుంది.
గూగుల్ మాప్స్ ఇప్పుడు మీ ప్రాధాన్యతల ఆధారంగా నిర్దిష్ట సూచనలను అందిస్తుంది. ఉదాహరణకు, మీరు స్నేహితులతో బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మ్యాప్స్‌లో రాత్రి సమయంలో స్నేహితులతో చేయవలసిన పనులు అని సెర్చే చేయండి. ఏఐ సమీపంలోని సంగీత వేదికలు లేదా కేఫ్‌లను సూచిస్తుంది. ఈ సూచనలు నిజమైన వినియోగదారుల రివ్యూలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి వ్యక్తులు ఆ స్థలంలో ఏమి ఇష్టపడుతున్నారో మీరు ఒక్కసారిగా తెలుసుకోవచ్చు.
మీరు “బయట సీటింగ్ ఉందా?” వంటి ప్రశ్నలను కూడా అడగొచ్చు. లేదా “అక్కడ వాతావరణం సౌకర్యవంతంగా ఉందా?”. దీని అర్థం మీరు ఇకపై రాత్రిపూట మంచి కేఫ్ లేదా స్థలం కోసం వెతకవలసిన అవసరం లేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం యూఎస్‌లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది.
డ్రైవింగ్ కోసం గూగుల్ మ్యాప్స్‌కి కొన్ని కొత్త టూల్స్ తీసుకొచ్చింది. వెళ్లే దారిలో స్టాప్‌లను యాడ్ చేయచ్చు. దారి పొడవునా నిర్దిష్ట స్థలాలు, రెస్టారెంట్లు లేదా ప్రత్యేక ప్రదేశాలను చూడవచ్చు. ఇది ప్రయాణాన్ని మరింత సరదాగా, సులభతరం చేస్తుంది. మ్యాప్స్‌లో ఇప్పుడు లేన్ గైడెన్స్ కూడా ఉంది. ఇది ఏ లేన్‌లో ఉండాలో మీకు తెలియజేస్తుంది. తద్వారా ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు. ఇది కాకుండా మ్యాప్స్‌లో వరదలు లేదా మంచు రోడ్లు, వాతావరణ సంబంధిత సమాచారాన్ని కూడా చూడవచ్చు. ఇది సురక్షితమైన డ్రైవింగ్‌లో సహాయపడుతుంది.
గూగుల్ “ఇమ్మర్సివ్ వ్యూ” ఇప్పుడు 150 నగరాలకు విస్తరించింది. ఈ ఫీచర్ ఏదైనా ప్రదేశం 3డీ వ్యూ అందిస్తుంది. ఇది అక్కడి వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులను కూడా చూపుతుంది. మీరు ప్రయాణించే ముందు స్టేడియం, పార్క్ లేదా కళాశాల వంటి ప్రదేశాలను వివరంగా చూడచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌లతో గూగుల్ మ్యాప్స్ మీ రోజువారీ పనులు, ప్రత్యేక పర్యటనలకు మంచి సహచరుడిగా మారుతోంది.