Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో 12 జీబీ ర్యామ్ ఫోన్‌లు రూ.9 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్లతో పాటు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. అదనంగా, మీరు ఈ ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనచ్చు. ఎక్స్చేంజ్ బోనస్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
Realme c61
6 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,199కి అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే, మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ని రూ. 299 ప్రారంభ EMIతో కొనుగోలు చేయచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 7,650 వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే. ఈ ఫోన్ 6 GB వర్చువల్ RAMతో పాటు 6 GB రియల్ ర్యామ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో ఫోన్ మొత్తం ర్యామ్ 12 జీబీకి చేరుకుంటుంది.
128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ Unisoc T612 చిప్‌సెట్‌లో పని చేస్తుంది. దీనిలో మీరు 6.74 అంగుళాల HD + డిస్ప్లే చూస్తారు. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 32-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ను పవర్ చేయడానికి 5000mAh బ్యాటరీ ఉంది.
Infinix hot 50 5g 50 5G
8 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.9,499. ఈ ఫోన్ సేల్‌లో రూ. 750 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. మీరు ఫోన్ కొనడానికి Flipkart Axis బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ. 334 ప్రారంభ EMI తో కూడా ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 8,950 చౌకగా ఉంటుంది.
ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. Infinix ఈ ఫోన్ MediaTek Dimension 6300 5G చిప్‌సెట్‌లో పని చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫోన్ బ్యాటరీ 5000mAh, ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.