Site icon Prime9

Flipkart iPhone Offers: ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. డిస్కౌంట్లు చూస్తే మైండ్‌ బ్లాక్..!

Flipkart iPhone Offers

Flipkart iPhone Offers

Flipkart iPhone Offers: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి కొత్త సేల్ ప్రకటించింది. కంపెనీ జనవరి 14 నుంచి రిపబ్లిక్ డేస్ 2025 సేల్‌ను తీసుకొస్తుంది. ప్లస్ మెంబర్లకు జనవరి 13 నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ సేల్‌కి ముందే ఈ కామర్స్ సైట్ ఐఫోన్ 16, 16 ప్లస్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు కూడా చాలా రోజుల నుంచి కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే ఈ డీల్స్ చెక్ చేయండి.

Apple iPhone 16
ఐఫోన్ 16 గురించి మాట్లాడితే ఈ మొబైల్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా కేవలం 74,900 రూపాయలకు ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.79,900కు విడుదల చేసింది. అంటే ప్రస్తుతం ఈ ఫోన్‌పై కంపెనీ నేరుగా రూ.5,000 తగ్గింపును ఇస్తోంది. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ ఆఫర్‌లతో ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ ద్వారా చెల్లింపుపై కంపెనీ రూ. 4 వేల అదనపు డిస్కౌంట్ అందిస్తోంది, దీని కారణంగా మీరు ఫోన్‌పై రూ. 9 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అంతే కాదు కంపెనీ రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది.

Apple iPhone 16 Plus
ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఐఫోన్ 16 ప్లస్‌పై తగ్గింపులను కూడా అందిస్తోంది. మీరు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ. 84,900తో కొనుగోలు చేయచ్చు. కాగా కంపెనీ గతేడాది ఈ ఫోన్‌ను రూ. 89,900కు ప్రవేశపెట్టింది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ ద్వారా ఈ ఫోన్‌పై రూ. 4,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై విపరీతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు UPI లావాదేవీ ద్వారా మీ ఫోన్‌లో రూ. 2,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

iPhone 16 Specifications
ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లను కలిగి ఉంది. ఇది 3ఎన్ఎమ్ ఆక్టా-కోర్ A18 చిప్‌సెట్‌తో ఉంది, 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. iOS 18లో రన్ అవుతుంది. అలానే ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 16 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 2x ఇన్-సెన్సర్ జూమ్, f/1.6 ఎపర్చర్‌తో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, f/2.2 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

Exit mobile version