Site icon Prime9

Nothing Phone 2a Offer: ఇది ఊహించలేదు.. నథింగ్ పాపులర్ ఫోన్‌పై భారీ ఆఫర్..!

Nothing Phone 2a

Nothing Phone 2a

Nothing Phone 2a Offer: ఎంతో పాపులర్ అయిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ద్వారా మార్కెట్‌లోకి వచ్చిన Nothing Phone (2a) 5G మొబైల్ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్ ధరను ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు నథింగ్ మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే దీని ఫీచర్లు, ధర, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ సైట్‌‌లో నథింగ్ ఫోన్ (2a) 5G కొనుగోలు చేయాడానికి భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.  7 శాతం తగ్గింపుతో వినియోగదారుల  దాని ఎంట్రీ-లెవల్ 8జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 23,999కి దక్కించుకోవచ్చు. కానీ వినియోగదారులు HDFC డెబిట్, క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ. 2000 తగ్గింపును పొందుతారు.

అదనంగా ఎంపిక చేసిన బ్యాంకుల నుండి ఆఫర్‌ను పొందడం ద్వారా కేవలం రూ. 21,999కి ఈ నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలానే దాదాపు రూ. 17,199 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ధరలో మరింత తగ్గింపు పొందచ్చు. ఈ డీల్ ధర మీ పాత స్మార్ట్‌ఫోన్ పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు.

Nothing Phone (2a) 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు స్మూత్‌గా రన్ అవుతుంది. ఇంకా పంచ్-హోల్ డిజైన్ లీనమయ్యే  వీక్షణ అనుభవం కోసం స్క్రీన్ స్థలాన్ని పెంచుతుంది. ఇది డ్యూయల్ 50MP + 50MP ప్రైమరీ కెమెరా లెన్స్‌లతో కూడిన డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ (2a) 5G వినియోగదారులను అత్యంత స్పష్టతతో అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా 32MP ఫ్రంట్ కెమెరాతో హై క్వాలీటీ ఫోటోలను క్యాప్చర్ చేయొచ్చు.

నథింగ్ ఫోన్ (2a) మెడిటెక్ డైమెన్సిటీ 7200 Pro 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్‌తో పాటు 3GHz వద్ద క్లాక్ చేసిన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 50W పవర్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అంటే మీరు మీ ఫోన్‌ను తక్కువ టైమ్‌లో ఫుల్‌గా ఛార్జ్ చేయచ్చు, బ్యాటరీలో ఎటువంటి సమస్యలు లేకుండా రోజంతా ఉపయోగించవచ్చు.

Exit mobile version