Site icon Prime9

Google Pixel 8A Discount: మీ మైండ్ బ్లాక్ అయ్యే డీల్.. బడ్జెట్ ధరకే గూగుల్ పిక్సెల్.. ఆలస్యం చేయకండి..!

Google Pixel 8A Discount

Google Pixel 8A Discount: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మాన్యుమెంటల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులను ప్రత్యేకమైన తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. మీరు మిడ్‌రేంజ్ విభాగంలో శక్తివంతమైన కెమెరాతో కూడిన ఫోన్ కావాలనుకుంటే, Google Pixel 8A మీకు బలమైన ఎంపిక. ఈ ఫోన్‌ను లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలానే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన మోడళ్లతో రూ. 1000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ లైనప్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేక ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌ కలిగి ఉంటాయి. ఇవి అద్భుతమైన కెమెరా పనితీరును అందిస్తాయి. ఇది కాకుండా మొబైల్ ఫ్యూర్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇతర ఫోన్‌ల కంటే దీనిలో సరికొత్త ఆండ్రాయిడ్ ఫీచర్‌లు ఉంటాయి. Pixel 8A అనేది కంపెనీ సరికొత్త సరసమైన మోడల్దా, దీనిపై బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల సహాయంతో పేమెంట్ చేస్తే వారికి రూ. 3000 తగ్గింపు లభిస్తుంది. ఇలా చేస్తే ఫోన్ ధర రూ.35 వేల లోపే ఉంటుంది. ఇది కాకుండా, ఎంపిక చేసిన మోడళ్లతో రూ. 1000 ఎక్స్ఛేంజ్ బోనస్  కూడా లభిస్తుంది.

పాత ఫోన్ మోడల్ కండీషన్ ఆధారంగా, Pixel 8Aపై గరిష్టంగా రూ. 24,650 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ అనేక కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. అందులో బే, అబ్సిడియన్ ఉన్నాయి.

Google Pixel 8A Specifications
పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దానిపై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ అందించారు. ఈ ఫోన్ Google Tensor G3 (4nm) ప్రాసెసర్‌తో వస్తుంది. ఇటీవల ఫోన్ Android 15 అప్‌గ్రేడ్ పొందింది. వెనుక ప్యానెల్‌లో 64MP మెయిన్ OIS సెన్సార్,  13MP సెకండరీ సెన్సార్‌తో కూడిన కెమెరా సెటప్ అందించారు. ఈ ఫోన్ 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీని 4404mAh బ్యాటరీకి 18W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Exit mobile version