Site icon Prime9

Mobile Offers: ఒకేసారి మూడు ఆఫర్లు.. గూగుల్ పిక్సెల్ ఫోన్లు సగం ధరకే.. పోయేలోపు కొనండి..!

Mobile Offers

Mobile Offers: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ రెండిటిలోనూ రిపబ్లిక్ డే సేల్ లైవ్ అవుతుంది. సంస్థలు చాలా స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమమైన డీల్స్‌ను అందిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్లపై అతిపెద్ద తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఈ సిరీస్‌లో పవర్ ఫుల్ ఫోన్‌పై రూ. 30 వేల ఫ్లాట్ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అంతే కాదు ఒక ఫోన్‌పై రూ.28 వేలు, మరో దానిపై రూ.15 వేలు తగ్గింపు లభిస్తుంది. మూడు ఫోన్‌లు గూగుల్ అందించిన గొప్ప ఫోన్లు. ఈ బెస్ట్ డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Google Pixel 8
గూగుల్ పిక్సెల్ 8 ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌పై కంపెనీ రూ.28 వేల తగ్గింపు ఇస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ని రూ.75,999కి లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 47,999కే మీ సొంతం  చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ఎంపికతో మీరు ఫోన్‌పై రూ.3000 తగ్గింపు పొందచ్చు. ఇది ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో ఫోన్‌పై రూ.24 వరకు తగ్గింపు పొందచ్చు.

Google Pixel 8a
ఈ సిరీస్‌లోని Google Pixel 8a కూడా ఈ సేల్‌లో చాలా చౌకగా లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 52,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 37,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే డివైస్ పై రూ.15,000 వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ఎంపికతో ఈ ఫోన్‌పై రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు, ఇది ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది.

Google Pixel 7
ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 7 సగం ధరకే అందుబాటులో ఉంది. అవును, ఎలాంటి ఆఫర్ లేకుండా ఫోన్ పై రూ.30 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు ఫోన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ‌తో రూ. 3,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు ఫోన్‌పై రూ. 24,000 వరకు అదనపు తగ్గింపు పొంవచ్చు. ఇది మాత్రమే కాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌లో 5శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version