Site icon Prime9

Infinix Zero 40 5G: వీడెవడండీ బాబూ.. ఒక్క ఫోన్‌పై ఇన్ని ఆఫర్లా..?

Infinix Zero 40 5G

Infinix Zero 40 5G

Infinix Zero 40 5G: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగలో భాగంగా ఎంపిక చేసిన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Infinix Zero 40 5G ఫోన్‌పై బలమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్. ఈ మొబైల్  12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర 27,999 రూపాయలుగా ఉంది.  అదనంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

Infinix Zero 40 5G మొబైల్ 5,000mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కలిగి ఉంది. అదనంగా ఈ మొబైల్ డైమెన్షన్ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ పవర్‌తో పని చేస్తుంది. కాబట్టి Infinix Zero 40 5G ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.

Infinix Zero 40 5G Features
Infinix Zero 40 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ డిస్‌ప్లే గరిష్టంగా 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 OSకి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది 8GB RAM + 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

Infinix Zero 40 5G ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇతర రెండు కెమెరాలలో వరుసగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా,  2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందించారు.

Infinix Zero 40 5G ఫోన్‌లో పవర్ కోసం 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. అలానే ఇది 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14.5తో రన్ అవుతుంది. రెండేళ్ల OS అప్‌గ్రేడ్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు. AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Exit mobile version