Flipkart Best Deals: ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో Motorola Edge 50 Neo, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా Vivo T3 Ultraపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్‌లో మీరు ఈ రెండు ఫోన్‌లను రూ. 1500 వరకు తగ్గింపుతో కొనచ్చు. ఈ ఫోన్లపై గొప్ప క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు Vivo, Motorola ఈ ఫోన్‌లు కూడా బంపర్ ఎక్స్ఛేంజ్ బోనస్‌తో మీ సొంతం కావచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
Motorola Edge 50 Neo
ఫ్లిప్‌కార్ట్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.20,999. సేల్‌లో మీరు దీన్ని రూ. 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 19,750 వరకు చౌకగా పొందచ్చు.
ఫీచర్ల గురించి చెప్పాలంటే.. మీరు ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల సూపర్ హెచ్‌డి డిస్‌ప్లే చూస్తారు. డైమెన్షన్ 7300 ప్రాసెసర్‌పై ఫోన్ పనిచేస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్స్. ఫోన్ బ్యాటరీ 4310mAh, ఇది 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Vivo T3 Ultra
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.29,999. మీరు బ్యాంక్ ఆఫర్‌లలో 1500 రూపాయల వరకు తగ్గింపుతో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్ రూ. 28,300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా మీ సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్ల విషయాని కొస్తే.. మీరు ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే పొందుతారు. కంపెనీ ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్ డైమెన్షన్ 9200+ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5500mAh, ఇది 80W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.