Site icon Prime9

iPhone Offers: ఆఫర్ల జాతర.. ఐఫోన్లపై భారీగా బ్యాంక్ ఆఫర్లు.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు..!

iPhone Offers

iPhone Offers

iPhone Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ డీల్స్‌లో తక్కువ ధరకే మొబైల్స్ కొనుగోలు చేయచ్చు. అలానే ఐఫొన్లపై బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు, క్యాష్ బ్యాక్‌లు కూడా పొందచ్చు. వీటితో పాటు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపులు లభిస్తాయి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీ మొబైల్ పర్ఫామెన్స్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

iPhone 15
128 GB స్టోరేజ్‌తో పింక్ కలర్ వేరియంట్ 60,999 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు (EMI లావాదేవీ) చేయడం ద్వారా రూ. 1,000 వరకు తగ్గింపు పొందచ్చు. UPI లావాదేవీలు చేసే వినియోగదారులకు రూ.1,000 తగ్గింపు కూడా అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 58,700 వరకు ప్రయోజనం పొందవచ్చు. iPhone 16లో 48 మెగాపిక్సెల్ మెయినక్ కెమెరా, A16 బయోనిక్ చిప్‌సెట్‌ను చూడొచ్చు.

iPhone 16
128 GB స్టోరేజ్‌తో అల్ట్రామెరైన్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,900కి అందుబాటులో ఉంది. కంపెనీ ఫోన్‌పై రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై చేసిన చెల్లింపులకు (ఇఎంఐ లావాదేవీలు) ఈ తగ్గింపు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్‌ను రూ. 60,600 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనుగోలు చేయచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఫోన్‌లో A18 ప్రాసెసర్‌ని పొందుతారు. ఫోన్ మెయిన్  కెమెరా 48 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో అందించిన సూపర్ రెటినా XDR డిస్‌ప్లే 6.1 అంగుళాలు.

iPhone 16 Plus
256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్  వైట్ కలర్ వేరియంట్ రూ.99,900కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 1500 వరకు తగ్గింపుతో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే చెల్లింపులకు ఈ తగ్గింపు లభిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.60,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఫోన్ 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది.

Exit mobile version