Motorola Edge 50 Ultra 5G Price Drop: మోటరోలా గత ఏడాది కాలంలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. Motorola తన కస్టమర్‌లు, అభిమానుల కోసం తన పోర్ట్‌ఫోలియోకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను జోడించింది. విశేషమేమిటంటే, కంపెనీకి తక్కువ ధర నుండి ఖరీదైన ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మోటరోలా ఫోన్‌ని కొనాలని చూస్తుంటే Motorola Edge 50 Ultra 5G ధరను భారీగా తగ్గించింది.
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ , 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉన్న కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. మీరు స్టైలిష్‌గా, అందంగా కనిపించే, కొంచెం డిఫరెంట్‌గా కనిపించే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే మీరు ఈ ఫోన్‌ను కొనచ్చు.
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు లాంచ్ ధర కంటే చాలా తక్కువగా పడిపోయింది. ఇప్పుడు ఫోన్‌ని కొనడానికి ఇదే మంచి అవకాశం.
Motorola Edge 50 Ultra 5G Offers
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ 512జీబీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,999గా ఉంది. కంపెనీ ప్రస్తుతం ఈ ఫోన్‌పై వినియోగదారులకు 23శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ తర్వాత మీరు దీన్ని కేవలం రూ.49,999కే ఆర్డర్ చేయచ్చు. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.
అంతేకాకుండా ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ను రూ.19 వేల లోపే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, దీని కోసం మీరు కొన్నిఆఫర్లను వినియోగించాలి. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు రూ.31,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకోవడం ద్వారా రూ.31,200 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, మీరు పొందే ఎక్స్ఛేంజ్ వాల్యూ మొత్తం మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లు అన్నింటిని ఉపయోగించినట్లయితే మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీని కేవలం రూ. 18,700కే ఇంటికి తీసుకెళ్లచ్చు.