Site icon Prime9

Vivo T3 Ultra Price Drop: ఫోటోల ఫోన్.. బొమ్మ అదిరిపోద్ది.. ఇప్పుడు తక్కువ ధరకే కొనండి..!

Vivo T3 Ultra Price Drop

Vivo T3 Ultra Price Drop

Vivo T3 Ultra Price Drop: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై గొప్ప ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంది. అయితే మీరు బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు అదిరిపోయే క్వాలిటీ అందించే స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. సేల్‌లో Vivo T3 Ultra ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. దీనిలో 50 మెగాపిక్సెెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.  అలానే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.35,999. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 29 వరకు జరుగుతుంది. సేల్‌లో Vivo T3 Ultra ఫోన్‌పై రూ.3000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు ఫోన్ ఆర్డర్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే  5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.35,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది.అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు అనేది మీఫోన్, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

Vivo T3 Ultra Features And Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.. ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ రేంజ్ 4500 నిట్‌లు. ఫోన్ గరిష్టంగా 12 GB LPDDR5x RAM + 256 GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో ఉంటుంది. ప్రాసెసర్‌గా, కంపెనీ ఈ ఫోన్‌లో డైమెన్షన్ 9200+ చిప్‌సెట్‌ను అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. దీనిలో మీరు 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌ను చూడవచ్చు. అదే సమయంలో సెల్ఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో ఆటో ఫోకస్‌తో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.

పవర్ విషయానికి వస్తే.. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5500mAh. ఈ బ్యాటరీ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14లో పని చేస్తుంది. దీనిలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కూడా పొందుతుంది.

Exit mobile version