Google Pixel 8 Discount Offer: బిగ్ బచాట్ డేస్ సేల్ మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. ఈ సేల్‌లో గూగుల్ ఫోన్ ధర రూ.29 వేలు తగ్గుతోంది. అయితే, ఇందులో బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. చాలా రోజులుగా ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ మిస్ అవ్వద్దు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Google Pixel 8 Offers
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 ప్రస్తుతం డిస్కౌంట్‌తో కేవలం రూ.49,999కే అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.75,999కి విడుదల చేసింది. అంటే ప్రస్తుతం ఎలాంటి ఆఫర్ లేకుండా నేరుగా ఫోన్ లో రూ.26 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో ఫోన్‌పై రూ. 3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డీల్ స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. అన్ని ఆఫర్లపై ఫోన్ ధర రూ. 29 వేలు తగ్గుతుంది.
కంపెనీ ఈ ఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది, దీని ద్వారా మీరు రూ. 10 నుండి 15 వేల వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. మీరు iPhone 11ని ఎక్స్ఛేంజ్‌లో ఇస్తే.. రూ. 14,150 వరకు ఆదా చేసుకోవచ్చు. వీటన్ని ధర ఫోన్ ధర రూ. 35,849కి తగ్గుతుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.
Google Pixel 8 Features
గూగుల్ పిక్సెల్ 8లో 6.2-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే కనిపిస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉంటుంది. ఈ ఫోన్ 2000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. ఇది కాకుండా, Google టెన్సర్ G3 చిప్‌సెట్ హ్యాండ్‌సెట్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 OSలో రన్ అవుతుంది.
ఫోటోగ్రఫీ కోసం Google Pixel 8 వెనుక రెండు కెమెరా సెన్సార్‌లు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా , 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 4575mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.