Flipkart Offer: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఐఫోన్ మోడల్‌పై రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపు, రూ. 3,000 బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని గతంలో కంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. మీరు అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మీ మొదటి ఐఫోన్‌ను కొనాలనుకుంటున్నా.. ఈ డీల్ గొప్ప అవకాశం. ఆఫర్‌తో మీకు ఫోన్‌పై రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. ఈ బెస్ట్ ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను చూద్దాం.
ఐఫోన్ 16 ప్రోని దేశంలో రూ. 1,19,900కి విడుల చేసింది. అయితే, ప్రస్తుతం మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,000 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు, అప్పుడు దీని ధర రూ. 1,12,900 అవుతుంది. దీనితో పాటు, మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నో కాస్ట్-EMI లావాదేవీలు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
ఇది మాత్రమే కాకుండా, మీరు దాని ధరను మరింత తగ్గించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఐఫోన్ 11 ఎక్స్‌ఛేంజ్‌పై కంపెనీ ప్రస్తుతం రూ. 17,150 వరకు తగ్గింపును అందిస్తోంది. దీనితో మీరు కొత్త ఫోన్‌పై మరిన్ని తగ్గింపులను పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రోలో 6.3-అంగుళాల డిస్‌ప్లే కనిపిస్తుంది, ఇది డాల్బీ విజన్ , 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫ్రేమ్కుడి వైపున ‘కెమెరా కంట్రోల్ బటన్’ ఉంది, ఇది ఫోటోలు తీయడానికి, వీడియోలను రికార్డ్ చేయడానికి, కెమెరా సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడానికి ఉపయోగించచ్చు. ఈ ఫోన్ గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్‌తో తయారుచేశారు.
ఐఫోన్ 16 ప్రోలో ఆపిల్ 3nm A18 ప్రో చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ 3367mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఈ బ్యాటరీ 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, iPhone 16 Pro మోడల్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 12MP సెల్ఫీ కెమెరాను అందించారు.