Motorola G45 5G Price Cut: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ లవర్స్‌కు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అది కూడా Motorola G45 5G ఫోన్ ధరను ఊహించని విధంగా తగ్గించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా చాలా అద్భుంగా ఉన్నాయి. ఈ క్రమంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఉత్సహంలో ఉంటే ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, దాని ఫీచర్లు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మోటరోలా g45 5G స్మార్ట్‌ఫోన్ 8 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 14,999తో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీని ధరను 20శాతం తగ్గించింది. దీంతో రూ. 11,999లకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. దీనిపై రూ.8,850 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా కలర్ ఆప్షన్‌లలో అందించారు. ఇందులో, 4 GB RAMతో 128 GB వేరియంట్ కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.
Motorola g45 5G Specifications
ఈ ఫోన్ 6.5 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1600 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ Qualcomm SD 6s Gen 3 6nm ప్రాసెసర్‌లో పనిచేస్తుంది. ఇది క్వాల్‌కమ్ ఎంట్రీ లెవల్ చిప్‌సెట్. ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీ కోసం 16MP సెన్సార్ ఉంది.
ఫోన్‌లో 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000 mAh బ్యాటరీ ఉంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి ఇది IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ తేలికగా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడితే ఇది డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C 2.0, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.