Samsung Mobile Deals: క్రిస్మస్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ముందు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సరికొత్త ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది. డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. సేల్ ఈవెంట్‌లో అనేక రకాల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సామ్‌సంగ్ ప్రీమియం ఫోన్‌లు చాలా చౌక ధరలకు లభిస్తాయి. అయితే మీరు కూడా చాలా కాలంగా కొత్త సామ్‌సంగ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే అటువంటి మూడు బెస్ట్ డీల్స్‌ను చెక్ చేయొచ్చు. సేల్‌లో సామ్‌సంగ్ ఫోన్లపై రూ.49 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రండి, బెస్ట్ డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
SAMSUNG Galaxy S23 FE
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23ఎఫ్ఈ గత సంవత్సరం అక్టోబర్ 2023లో ప్రారంభించారు. మొబైల్ ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ. 30,999కి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ.79,999. దాని ప్రకారం చూస్తే ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా నేరుగా ఫోన్ పై రూ.49 వేల వరకు తగ్గింపు లభిస్తుండడంతో బెస్ట్ డీల్ గా నిలిచింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌లో నో కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు నెలకు రూ. 3,445 చెల్లించి సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.
SAMSUNG Galaxy M35 5G
మీరు 15 నుండి 20 వేల బడ్జెట్‌లో మంచి సామ్‌సంగ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, SAMSUNG Galaxy M35 5G ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ. 15,570. ఈ ఫోన్‌పై కంపెనీ 36 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ధరలో ఇది 6000 mAh బ్యాటరీని కలిగి ఉన్నందున ఇది కిల్లర్ ఫోన్‌గా కనిపిస్తుంది. అలాగే మొబైల్ 6 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది, అయితే దీని కోసం మీరు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలి.
SAMSUNG Galaxy A14 5G
జాబితాలోని చివరి ఫోన్ గురించి మాట్లాడితే ఇది Samsung నుండి వచ్చిన ఎంట్రీ లెవల్ 5G ఫోన్, మీరు ఇప్పుడు గరిష్టంగా 47 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఈ సేల్‌లో ఈ ఫోన్ ధర రూ.10,999గా మారింది. అంటే ఈ ఫోన్ లాంచ్ ధర నుండి నేరుగా రూ.10,000 తగ్గింపును పొందుతోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌పై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.