Site icon Prime9

Flipkart Best Mobile Deals: కేక ఆఫర్స్.. ఈ ఐదు ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్స్.. మతిపోగొడుతున్న బ్యాంక్ డిస్కౌంట్లు..!

Flipkart Best Mobile Deals

Flipkart Best Mobile Deals: గత కొన్ని రోజులుగా ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద సేల్ జరుగుతోంది. సేల్ చివరి రోజు జనవరి 19 అయితే ఈ కామర్స్ దిగ్గజం తన కస్టమర్లకు మళ్లీ పెద్ద బహుమతిని అందించింది. కంపెనీ సేల్ అన్నీ ఆఫర్లను పొడిగించింది. ఈ ఆఫర్లు ఎంతకాలం కొనసాగుతుందనేవది ఇంకా తెలియలేదు. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే సేల్‌లో ఉన్న 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి తెలుసుకుందాం.

Realme P1 5G
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో Realme P1 5Gపై పెద్ద తగ్గింపు కనిపిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 20,999కి లాంచ్ చేసింది కానీ సేల్‌లో దీని ధర రూ.13,999 మాత్రమే. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గించచ్చు.

Vivo T3 Lite 5G
ఈ 5G ఫోన్ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ. 14,499కి లాంచ్ చేసింది, అయితే ఇప్పుడు దాని ధర రూ. 10,499కి తగ్గింది. బ్యాంక్ ఆఫర్‌తో పాటు, ఫోన్‌పై అదనంగా రూ.500 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

OPPO K12x 5G
ఈ సేల్‌లో OPPO K12x 5G కూడా చాలా చౌక ధరలో అందుబాటులో ఉంది. ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ. 16,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌పై రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది, ఇది ధరను మరింత తగ్గిస్తుంది.

Nothing Phone (2a) 5G
నథింగ్ ఈ ఫోన్ కూడా ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ. 25,999కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 20,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1500 వరకు తగ్గింపును కూడా పొందుతోంది.

POCO C61
ఈ ఫోన్ సేల్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే.. మీరు POCO C61ని కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో దీని ధర రూ.5,999గా మారింది. కాగా కంపెనీ ఈ ఫోన్‌ను రూ.8,999కి లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్‌పై ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేదు.

Exit mobile version