Site icon Prime9

Flipkart iPhone Offers: వెలుగుల దీపావళి.. ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డీల్స్.. పండుగను రెట్టింపు చేయండి!

Flipkart iPhone Offers

Flipkart iPhone Offers

Flipkart iPhone Offers: వెలుగుల పండగ దీపావళి వచ్చేస్తోంది. పండుగను ఆనందంగా జరుపుకోడానికి అందురూ సిద్ధమవుతున్నారు. సరికొత్త వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రకటించింది. సేల్‌ అక్టోబర్ 31 వరకు లైవ్ అవుతుంది. దీనిలో  ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో వేరియంట్లతో పాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లను ప్రకటించింది. అయితే కొంతమంది ఐఫోన్ 16 సిరీస్‌పై డిస్కౌంట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.ఆ టైమ్ రానే వచ్చింది. కంపెనీ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌‌పై ఆఫర్లను వెల్లడించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 16 Series Discounts
ఫ్లిప్‌కార్ట్ iPhone 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లను వాటి లాంచ్ ధరలకు విక్రయిస్తోంది. అయితే మీరు బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి మీకు ఇష్టమైన ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16, ప్లస్, ప్రో,  ప్రో మ్యాక్స్‌లపై ఎస్‌బీఐ రూ. 1,250 వరకు తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా కంపెనీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అలానే మీరు మీ పాత ఐఫోన్ 13 ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ. 24 వేల తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌తో ఫోన్ ధర రూ.55,900 అవుతుంది.

అయితే మీకు ఇంతకు మించి డిస్కౌంట్ కావాలంటే విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ని కొనుగోలు చేయాలి. ఈ ప్లాట్‌ఫామ్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఇది స్టాండర్డ్ వెర్షన్‌లో ఉంది. ప్రో మోడల్‌లు రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఈ బ్యాంక్ ఆఫర్లు ఫోన్ ధరను గణనీయంగా తగ్గించాయి.

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 128GB మోడల్ ధర 79,900 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఆపిల్ 256GB వేరియంట్ రూ.89,900, టాప్-ఎండ్ 512GB వేరియంట్ రూ.1,09,900 లను కొనుగోలు చేయచ్చు. పెద్ద డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఐఫోన్ 16 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. 128GB మోడల్‌కు ధర రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. 256GB వేరియంట్ ధర రూ.99,900, 512GB మోడల్ రూ.1,19,900కి అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 16 ప్రో 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ.1,19,900. ఆపిల్ 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లను కూడా ప్రవేశపెట్టింది. వీటి ధరలు వరుసగా రూ.1,29,900, రూ.1,49,900, రూ.1,69,900. టాప్-ఆఫ్-ది-లైన్ అనుభవం కోసం చూస్తున్న వారికి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర 256GB వేరియంట్‌కు రూ. 1,44,900 నుండి ప్రారంభమవుతుంది. 512జీబీ మోడల్ ధర రూ.1,64,900 కాగా, 1టీబీ వెర్షన్ ధర రూ.1,84,900.

Exit mobile version