Site icon Prime9

Flipkart Diwali Offers: అద్భుతమైన ఆఫర్.. సామ్‌సంగ్ ప్రీమియం ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

Flipkart Diwali Offers

Flipkart Diwali Offers

Flipkart Diwali Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను ప్రకటించింది.  దీపావళి సందర్భంగా భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. బిగ్ దీపావళి సేల్ స్మార్ట్‌ఫోన్‌లపై కళ్లు చెదిరే తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్‌లో Samsung Galaxy S24+ ప్రీమియం మొబైల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది జనవరిలో విడుదల చేసింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ S24+ని సంవత్సరంలో అతిపెద్ద తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను ఈ ఏడాది జనవరిలో విడుదల చేసింది. ఇందులో టాప్ నాచ్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్‌ ఉంటుంది.

ఫోటోగ్రఫీ కోసం మీరు ఎటువంటి సందేహం లేకుండా Samsung Galaxy S24+ని కొనుగోలు చేయవచ్చు. దీనిలో మీరు వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూస్తారు. దీనిలో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న దీపావళి తగ్గింపు ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం

సామ్‌సంగ్ గెలాక్సీ S24+  256GB వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 99,999 అంటే సుమారు రూ. 1 లక్షకు అందుబాటులో ఉంది. అయితే సేల్ ఆఫర్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. సామ్‌‌సంగ్ S24+ ఈ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు 35 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌తో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.64,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఫ్లాట్ డిస్కౌంట్ కాకుండా ఫ్లిప్‌కార్ట్ తన రెగ్యులర్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా కస్టమర్లకు అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. మీరు దీన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు వెళ్లవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

Samsung Galaxy S24+ Features
సామ్‌సంగ్ గెలాక్సీ S24+లో మీరు బలమైన అల్యూమినియం ఫ్రేమ్‌తో గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను పొందుతారు. దీనికి IP68 రేటింగ్ ఉంది.  కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్  ఉంది. ఫోన్ గరిష్టంగా 12GB ర్యామ్+  512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 50+10+12 మెగాపిక్సెల్‌ల ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Exit mobile version