Site icon Prime9

 Infinix Note 40 5G: మొదటి సారి.. ఇన్‌ఫినిక్స్ ప్రీమియం ఫోన్‌పై బిగ్ డీల్.. మళ్లీ మళ్లీ రావు..!

 Infinix Note 40 5G

 Infinix Note 40 5G

 Infinix Note 40 5G: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల విషయంలో తగ్గడం లేదు. వరుసగా డిస్కౌంట్లు, డీల్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే Infinix Note 40 5Gపై స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అలానే బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 108MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. MediaTek ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇది ఆపిల్ ఐఫోన్ MagSafe వలె Infinix Note 40 5Gలో MahCharge మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న 8GB RAM వర్చువల్ RAM సపోర్ట్ కారణంగా 16GB వరకు విస్తరించుకోవచ్చు. అలానే ఉత్తమ మల్టీమీడియా అనుభవం కోసం JBL స్పీకర్లు ఫోన్‌లో అందించారు. ఈ ఫోన్ కెమెరా సెటప్‌లో AI వాయిస్ యాక్టివేటెడ్ హాలో లైటింగ్‌ను కూడా ఉంది.

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 15,999 తగ్గింపు ధరతో జాబితా చేసింది. ఏదైనా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే దానిపై రూ. 2000 తగ్గింపు ఇస్తున్నారు. దీని తర్వాత ధర రూ. 13,999కి తగ్గుతుంది. కస్టమర్‌లు కావాలనుకుంటే 6 నెలల వరకు నో-కాస్ట్ EMIతో Infinix Note 40 5Gని కూడా కొనుగోలు చేయొచ్చు. ఇది రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ ఉన్నాయి.

మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేయాలంటే దాని మోడల్, పరిస్థితిని బట్టి గరిష్టంగా రూ.11,050 వరకు తగ్గింపు పొందచ్చు. ఎంపిక చేసిన మోడళ్ల మార్పిడిపై రూ. 2,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.

Infinix Note 40 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంది. ఇది MediaTek Dimensity 7020 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. Android 14 ఆధారంగా XOS 14 సాఫ్ట్‌వేర్ స్కిన్ అందించారు. ఫోన్ IP53 రేటింగ్‌తో వస్తుంది. దాని 5000mAh కెపాసిటీ బ్యాటరీ 33W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతుంది. ఇది రివర్స్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఫోన్ వెనుక ప్యానెల్‌లో OISతో కూడిన 108MP ప్రైమరీ కెమెరా అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 2MP డెప్త్, 2MP మాక్రో సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది ఆడియో బ్రాండ్ JBL ద్వారా ట్యూన్ చేయబడిన స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది.

Exit mobile version