Vivo T3 5G: వివో తన కస్టమర్ల కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘Vivo T3 5G’ ఫోన్‌పై భారీ తగ్గింపు కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్‌ను కంపెనీ రూ.20,000 ధరతో విడుదల చేసింది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 15,500 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, ట్విన్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ వంటి హైలేట్ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి, మీరు దాదాపు రూ. 16,000 విలువైన కొత్త ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ డీల్‌ని అసలు మిస్ చేయకండి.
Vivo T3 5G Offers
వివో T3 5జీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 17,999. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లకు రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీని ధర రూ. 15,499కి తగ్గుతుంది. కస్టమర్‌లు నెలకు రూ. 3,000 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్. స్టాండర్డ్ EMI ఆప్షన్స్ కూడా ఎంచుకోవచ్చు. అదనంగా మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తే.. పర్ఫామెన్స్, మోడల్ ఆధారంగా రూ. 17,450 ఆదా చేసుకోవచ్చు. ఈ డీల్ 128GB వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఫోన్ కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్స్‌లో ఉంది. అంతే కాకుండా రూ. 799 చెల్లించి 1 సంవత్సరం పాటు పూర్తి మొబైల్ ప్రొటక్షన్‌ను ఆశ్వాదించవచ్చు.
Vivo T3 5G Specifications
వివో T3 5జీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14పై నడుస్తుంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌తో కూడా వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 2MP కెమెరా డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. కనెక్టవిటిలో Wi-Fi, GPS, బ్లూటూత్ v5.30, NFC, USB టైప్-C, 5G తో వస్తుంది.