Site icon Prime9

Samsung Galaxy S23 FE 5G: ఇలాంటి డీల్ రాదు బ్రో.. రూ.60 వేల ఫోన్ సగం ధరకే.. త్వరగా కొనేయండి..!

Samsung Galaxy S23 FE 5G

Samsung Galaxy S23 FE 5G

Samsung Galaxy S23 FE 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సరికొత్త సేల్స్‌లో వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తుంది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌‌ఫోన్‌లపై ఊహకందని డీల్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది. సేల్‌లో Samsung Galaxy S23 FE 5Gపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. గెలాక్సీ సిరీస్‌లో AI ఫీచర్లను అందించే చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పుడు సగం కంటే తరకే దక్కించుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ కంపెనీ ఇటీవలే అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను చేర్చింది.  ఇవి ఎంపిక చేసిన ప్రీమియం ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో  సర్కిల్-టు-సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఫోటో అసిస్ట్, చాట్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కంపెనీ ప్రీమియం ఫీచర్లను బడ్జెట్ ప్రైస్‌లో అందించడానికి ఫ్యాన్-ఎడిషన్ ఫోన్‌లను విడుదల చేస్తుంది. అటువంటి వేరియంటే గెలాక్సీ S23 FE.

టెక్ బ్రాండ్ తన ఫ్యాన్ ఎడిషన్ మోడల్ Galaxy S23 FEని భారతీయ మార్కెట్లో రూ. 59,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. దీన్ని ఇప్పులు దీపావళి సేల్‌లో రూ. 28,999కి ఆర్డర్ చేయచ్చు. ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఫోన్‌పై రూ.18,050 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మూడు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయచ్చు. అందులో గ్రాఫైట్, మింట్, పర్పుల్ ఉన్నాయి.

Samsung Galaxy S23 FE Specifications
సామ్‌సంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది ప్రత్యేక విజన్ బూస్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది Exynos 2200 ప్రాసెసర్‌‌పై పవర్‌ఫుల్‌గా రన్ అవుతుంది. 8GB RAM+ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4500mAh కెపాసిటీ బ్యాటరీకి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని, టన్నుల కొద్దీ AI ఫీచర్లను అందిస్తుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే గెలాక్సీ S23 FE వెనుక ప్యానెల్‌లోని 50MP ప్రైమరీ కెమెరా కాకుండా12MP అల్ట్రా-వైడ్ లెన్స్, OIS సపోర్ట్‌తో 8MP టెలిఫోటో జూమ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరా లో లైటింగ్ ఫోటోగ్రఫీలో కూడా బాగా పని చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 10MP ఫ్రంట్ కెమెరాను ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది.

Exit mobile version