Site icon Prime9

Best Mobile Offer: బ్లాక్ బస్టర్ డీల్.. సామ్‌సంగ్ 5జీ ఫోన్‌పై మతిపోగెట్టే ఆఫర్.. రూ. 317లకే ఆర్డర్ చేయచ్చు..!

Best Mobile Offer

Best Mobile Offer

Best Mobile Offer: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లతో దూసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించడానికి బిగ్ బచాట్ డేస్ సేల్‌ ప్రకటించింది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇప్పుడు Samsung Galaxy A14 5G ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.10 వేల కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఆర్టర్ చేయచ్చు. నవంబర్ 13 వరకు జరిగే ఈ సేల్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్‌ను రూ.8,999కి దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.16,499.

మీరు ఫోన్ ఆర్డర్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను రూ. 317 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 8,450 చౌకగా ఉంటుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

Samsung Galaxy A14 5G Features
కంపెనీ ఈ ఫోన్‌లో 1080×2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ గరిష్టంగా 8 GB LPDDR4x RAM + 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో Exynos 1330 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను చూస్తారు.

వీటిలో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 2మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫోన్‌ను పవర్ చేయడానికి  5000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఈ ఫోన్ Android 13 ఆధారంగా OneUI 5.0లో పని చేస్తుంది. భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెట్ చేసింది.

Exit mobile version