Site icon Prime9

Poco M6 Plus 5G: ఇంతకంటే ఏం కావాలి.. రూ.11,499లకే పోకో 5జీ ఫోన్..!

Poco M6 Plus 5G

Poco M6 Plus 5G

Poco M6 Plus 5G: కేవలం రూ.11,499లకే 108 మెగాపిక్సెల్ కెమెరా, 6.79 అంగుళాల పెద్ద డిస్ ప్లే, 5030mAh పవర్ ఫుల్ బ్యాటరీ.. మొబైల్ ప్రియులకి ఇంతకంటే ఏం కావాలి! అవును, Poco తన కస్టమర్లకు తీపి వార్త అందించింది. అద్భుతమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్ ధరను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 30 శాతం తగ్గింపును అందిస్తోంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

కంపెనీ Poco M6 ప్లస్ 5G ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది. మీరు దీనిని మిస్టీ లావెండర్, ఐస్ సిల్వర్, గ్రాఫైట్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జర్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంది. మీరు 12 వేల లోపు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి ఎంపిక.

పోకో M6 ప్లస్ 5G ఫోన్ 8జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై కంపెనీ 30 శాతం తగ్గింపును అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,499కి కొనుగోలు చేయచ్చు. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.12,499కి అందుబాటులో ఉంది.

పోకో M6 ప్లస్ 5G మొబైల్ 6.79-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE ప్రాసెసర్‌తో కంపెనీ Poco M6 Plus 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గ్రాఫిక్స్ కోసం అడ్రినో A613 GPU అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా సరికొత్త హైపర్ ఓఎస్‌లో పని చేస్తుంది. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంది.

పోకో M6 ప్లస్ 5G మొబైల్ 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. అదనంగా 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 5030mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 33W ఫాస్ట్ ఛార్జర్ ఉంది. మొబైల్ డస్ట్, స్ప్లాష్ నుండి ప్రొటక్షన్ కోసం IR బ్లాస్టర్, IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బాటమ్ ఫైరింగ్ లౌడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version