Site icon Prime9

Motorola G64 5G: మోటరోలా ఇచ్చిపడేసింది.. 5జీ ఫోన్‌పై భారీ ఆఫర్.. మనకు ఇంకేం కావాలి..!

Motorola G64 5G

Motorola G64 5G

Motorola G64 5G: బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా?.. అయితే ఇక ఆలస్యం చేయకుండా  రండి. ఇప్పుడు రూ.15 వేలో అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అదే Motorola G64 5G స్మార్ట్‌ఫోన్. ఫోన్ డిజైన్, ఫీచర్ల పరంగా నిరాశపరచదు. ఇందులో 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.  ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ దీనిపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌ ధరను 16 శాతం తగ్గించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోటరోలా ఈ స్మార్ట్‌ఫోన్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో పాటు మెడిటెక్ డైమన్సిటీ 7025ని అందిస్తుంది. బడ్జెట్ ప్రైస్‌లో ఇది బెస్ట్ ప్రాసెసర్. ఈ ఫోన్‌లో 12 జీబీ ఇన్‌స్టాల్ చేసిన ర్యామ్ ఉంది. దీని కారణంగా వినియోగదారులు ఒకేసారి మల్టీటాస్కింగ్ చేయచ్చు.  ఫోన్ డజనుకు పైగా 5G బ్యాండ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. OIS సపోర్ట్‌తో 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలానే ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ Moto G64 5Gని 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.14,999. మీరు యాక్సిస్ బ్యాంక్,ఐడిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల సహాయంతో ఈ ఫోన్‌కి చెల్లిస్తే రూ. 1000 ఫ్లాట్ తగ్గింపు పొందుతున్నారు. ఫోన్ ధర రూ. 13,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, దాని మోడల్, కండిషన్ ఆధారంగా మీరు గరిష్టంగా రూ. 8,600 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఐస్ లిలక్, మింట్ గ్రీన్, పెరల్ బ్లూ, రెడ్ బెర్రీ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD + LCD డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కలిగి ఉంది. ఫోన్ బలమైన పర్ఫామెన్స్ కోసం MediaTek Dimensity 7025 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో OISతో 50MP ప్రైమరీ లెన్స్, 8MP సెకండరీ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా అందించారు. 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 6000mAh కెపాసిటీ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది.

Exit mobile version