Mobile Offers: మీరు OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ధర కంటే తక్కువకే లభిస్తుంది. మంచి విషయం ఏమిటంటే ఇది 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో OnePlus చౌకైన ఫోన్ కూడా. అలానే దీనిపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2023లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కంపెనీ ఏప్రిల్ 2023లో భారతదేశంలో OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ర్యామ్, స్టోరేజ్ ప్రకారం రెండు వేరియంట్లలో వస్తుంది. లాంచింగ్ సమయంలో దాని 8GB + 128GB వేరియంట్ ధర రూ. 19,999. 8GB + 2568GB వేరియంట్ ధర రూ. 21,999. ఇది పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే వంటి రంగులలో కొనుగోలు చేయొచ్చు. దాని అప్‌గ్రేడ్ మోడల్ OnePlus Nord CE 4 Lite 5G భారతదేశంలోకి వచ్చింది. ఆ తర్వాత పాత మోడల్ తక్కువ ధరకు లభిస్తుంది.
ప్రస్తుతం 8GB + 128GB కాన్ఫిగరేషన్‌తో ఫోన్ క్రోమాటిక్ గ్రే కలర్ వేరియంట్ అమెజాన్‌లో కేవలం రూ. 15,670 అంటే లాంచ్ ధర కంటే రూ. 4,329 తక్కువకు అందుబాటులో ఉంది. అదేవిధంగా 8GB + 128GB కాన్ఫిగరేషన్‌తో కూడిన పాస్టెల్ లైమ్ కలర్ వేరియంట్ కేవలం రూ. 15,685కి అందుబాటులో ఉంది. అంటే లాంచ్ ధర కంటే రూ. 4,314 తక్కువ. బ్యాంక్ ఆఫర్లను ద్వారా ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు.
ఫోన్ డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 6.72-అంగుళాల పూర్తి HD ప్లస్ (1080×2400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 680 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ అందుబాటులో ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది.
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో EIS సపోర్ట్‌తో 108-మెగాపిక్సెల్ Samsung HM6 మెయిన్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.