Site icon Prime9

Infinix Hot 50 5G: టాప్ సెల్లింగ్ ఫోన్.. రూ.7,800కే ఇన్ఫినిక్స్ సూపర్ ఫోన్..!

Infinix Hot 50 5G

Infinix Hot 50 5G

Infinix Hot 50 5G: చైనీస్ టెక్ కంపెనీ Infinix భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో అనేక ఫోన్‌లను పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ 48MP Sony కెమెరా ఫోన్ Infinix Hot 50 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. 10 వేల కంటే తక్కువ రూపాయలకే కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో మెడిటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ కెమెరా కాకుండా Infinix Hot 50 5G 7.8mm సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. ప్రత్యేక AI ఫీచర్లతో పాటు ఈ ఫోన్ TUV సర్టిఫికేషన్ కారణంగా 5 సంవత్సరాల వరకు సున్నితమైన పనితీరును అందిస్తుందని పేర్కొంది. అలానే ఈ డివైస్‌లో యాపిల్ ఐఫోన్‌లో ఉన్న డైనమిక్ ఐలాండ్ వంటి డైనమిక్ బార్ అనే ఫీచర్ కూడా ఉంది. అల్ట్రా-ఓవర్ బ్యాక్ డిజైన్‌తో ఉన్న ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఫ్లాట్ బాక్సీ డిజైన్‌తో Infinix Hot 50 5G ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,999 కి అందుబాటులో ఉంది. ఈ ధర 4GB RAM + 128GB స్టోరేజీతో కూడిన వేరియంట్ కోసం. అలానే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా చెల్లింపుపై అదనపు డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఈ కార్డుల జాబితాలో SBI క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్  బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి.

కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసేటప్పుడు కూడా తగ్గింపుతో Infinix Hot 50 5Gని కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్ మోడల్ పరిస్థితిని బట్టి గరిష్టంగా రూ.7,800 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అందులో సేజ్ గ్రీన్, స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

Infinix స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 480nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో ఉంది. ఇది MediaTek Diemsity 6300 ప్రాసెసర్‌తో Android 14 ఆధారంగా XOS సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంది. Infinix Hot 50 5G వెనుక ప్యానెల్‌లో 48MP Sony IMX582 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందించారు. దీని 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుంది.

Exit mobile version