Site icon Prime9

iPhone Offers: ఇదెక్కడి మాస్ డీల్ బ్రో.. ఐఫోన్ 15పై భారీ ఆఫర్..!

iPhone Offers

iPhone Offers

iPhone Offers: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా స్మార్ట్‌ఫెస్టివల్ ద్వారా బలమైన డీల్స్ ప్రకటించింది. ఎంపిక చేసిక మొబైల్స్‌పై బొంబాట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. వాటిలో ఐఫోన్ 15 మొబైల్  ఉంది. దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్ చూస్తే నోరెళ్లబెడతారు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్‌లో iPhone 15 మొబైల్ ధరపై 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు కనిపిస్తుంది.

ఈ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ 57,999 రూపాయలకు అందుబాటులో ఉంది. అదనంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. ఐఫోన్ 15 మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్ సెన్సార్. అలానే ఇది బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది.  A16 బయోనిక్ చిప్‌సెట్‌లో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ఐఫోన్ 15 మొబైల్ 6.1 అంగుళాల డిస్‌ప్లే, 1600 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. ఇది పిల్-ఆకారపు పంచ్-హోల్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది, ఫేస్‌టైమ్ కెమెరా, ఫేస్ ID ఉన్నాయి. ఫోన్ A16 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనితో పాటు ఈ ఐఫోన్‌కు iOS 16 OS సపోర్ట్ కూడా ఉంది. అలానే ఐఫోన్ 15‌లో 128 GB, 256 GB, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి.

ఐఫోన్ 15 ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మొదటి కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. మసక వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీయడానికి ఇది పనిచేస్తుంది. అలానే సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైల్డ్ యాంగిల్ లెన్స్‌ని పొందింది. 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు.

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ దాని మునుపటి సిరీస్ కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇది ఐఫోన్ 15 ఫోన్ ప్లస్ పాయింట్లలో ఒకటి. ఇందులో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంది. ఫోన్‌లో రోడ్‌సైడ్ అసిస్టెంట్, శాటిలైట్స్ వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి.

Exit mobile version