Flipkart Mobile Offers: దసరా, దీపావళి ముగిసినా ఆఫర్ల హడావుడి తగ్గేలాలేదు. చాలా కంపెనీలు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లను అందిస్తున్నాయి. టెక్ దిగ్గజం సామ్‌సంగ్ కూడా ఈ విషయంలో వెనుకడుగు వేయడంలేదు. Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై 8000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు మీరు కేవలం 9,999 రూపాయలకు బుక్ చేయచ్చు.
కంపెనీ గతేడాది Samsung Galaxy A14 5G Poని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రియుల మన్ననలు పొందడంలో విజయవంతమైంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో కూడా దీనికి ఎక్కువ రేటింగ్ ఉంది. ప్రస్తుతం కంపెనీ తక్కువ ధర రూ.8,000కు విక్రయిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కంపెనీ Samsung Galaxy A14 5G ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది. ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 8,000 తగ్గింపు లభిస్తుంది. మీరు దీన్ని కేవలం రూ.10,999కి కొనుగోలు చేయవచ్చు. రూ. 18,999 ధరకు కంపెనీ దీన్ని లాంచ్ చేసింది.
ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.9,999కి అందుబాటులో ఉంది. రూ.7,500 తగ్గింపుతో కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు. కంపెనీ దీనిని రూ. 16,499కి విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందచ్చు. అదనంగా 6,100 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది
ఈ మొబైల్‌ని బ్లాక్, రెడ్, గ్రీన్ కలర్స్‌లో ఆర్డర్ చేయచ్చు. కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా ఫోన్ కొనుగోలు చేయచ్చు. ఈ ఆఫర్లన్నీ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పొందచ్చు. ఫోన్‌లో పెద్ద 6.6-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది IPS LCD ప్యానెల్. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1080 × 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.
కంపెనీ Exynos 1330 ప్రాసెసర్‌తో Samsung Galaxy A14 5Gని విడుదల చేసింది. ఈ మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ Samsung ఫోన్ Android 13 ఆధారంగా OneUI 5.0 పై పని చేస్తుంది. దీనికి రెండు OS అప్‌డేట్‌లు వస్తాయి.
స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్‌లో కంపెనీ 5,000mAh కెపాసిటీ గల బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 15W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ ఫోన్‌లో 5G, 4G, డ్యూయల్ బ్యాండ్, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్ C పోర్ట్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.