Site icon Prime9

Samsung Galaxy S23 FE: ఓరేయ్ ఆజామూ.. ఆఫర్ చూశావా.. ఫోన్‌పై రూ.47 వేల డిస్కౌంట్!

Samsung Galaxy S23 FE

Samsung Galaxy S23 FE

Samsung Galaxy S23 FE: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. దీపావళి సేల్‌ నవంబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌పై అతిపెద్ద తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఈ ప్రీమియం మొబైల్‌ని రూ.47 వేల డిస్కౌంట్‌తో ఆర్డర్ చేయచ్చు. అలానే బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లు, ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా క్వాలిటీని అందిస్తుంది. మీరు ప్రీమియం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఈ ప్రత్యేక ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Samsung Galaxy S23 FE Offer
ప్రస్తుతం Samsung Galaxy S23 FE ఎటువంటి ఆఫర్ లేకుండా ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 32,999కి అందుబాటులో ఉంది. అయితే దీని ప్రారంభ ధర రూ. 79,999. ఓవరాల్‌గా కంపెనీ ఫోన్‌పై నేరుగా రూ.47 వేలు తగ్గింపు ఇస్తుంది. ఈ డీల్‌ను అత్యంత ప్రత్యేకం చేసింది.

ఇది మాత్రమే కాకుండా మీరు ఫోన్‌ను నో కాస్ట్ EMIపై  రూ. 5,500తో కొనుగోలు చేయవచ్చు. ఇది ఈ డీల్‌ను మరింత మెరుగ్గా చేస్తుంది. ఆఫర్ ఇంకా ఇక్కడితో ముగియలేదు.. కంపెనీ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది. ఇక్కడ మీ పాత ఫోన్ పరిస్థితిని బట్టి మీరు రూ. 10 నుండి 20 వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

SAMSUNG Galaxy S23 FE Features
ఇది అన్ని గెలాక్సీ AI ఫీచర్‌లను అందించే చౌకైన స్మార్ట్‌ఫోన్. దీనిలో ఫోటో అసిస్ట్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది వినియోగదారులను AI ఫీచర్లు పొందేలా చేస్తుంది. మీరు ఫోటోలను ఎడిట్ చేయడానికి, వాటిని రీటచ్ చేయడానికి దీన్ని ఉపయోగించచ్చు.

ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది.  స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAM + 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ Exynos 2200 SoC ఆధారంగా రన్ అవుతుంది. 12 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్. 8 MP టెలిఫోటో జూమ్ లెన్స్‌ను కలిగి ఉన్న ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

కాస్ట్‌‌లీ సామ్‌సంగ్ ఫోన్‌ల మాదిరిగానే Galaxy S23 FE ప్రీమియం గ్లాస్-మెటల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP68-రేటింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. USB-C పోర్ట్ ద్వారా 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Exit mobile version