Prime9

Flipkart Mobile Offer: మీ మైండ్ బ్లాక్ అయ్యే డీల్.. రూ.9,999కే కిర్రాక్ ఫోన్..!

Flipkart Mobile Offer: మీరు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో బెస్ట్ కెమెరా, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ అందించే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు అద్భుతమైన శుభవార్త ఉంది. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ Infinix Hot 40iపై బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌లో  8 జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. అలానే  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ ఫోన్ అసలు ధర రూ.9,999.  దీనిపై బ్యాంక్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో రూ.1,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. అలానే మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 8,850 వరకు చౌకగా మారుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్‌లో మీరు 50 మెగాపిక్సెల్ బ్యాక్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుతారు.

Infinix Hot 40i Features
ఈ ఫోన్‌లో మీరు 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే పొందుతారు. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 480 నిట్‌లు. కంపెనీ ఫోన్‌లో 8 జీబీ రియల్ ర్యామ్‌తో పాటు 8 జీబీ వర్చువల్ ర్యామ్‌ను కూడా అందిస్తోంది. దీనితో మొత్తం ర్యామ్ 16 జీబీ వరకు పెరుగుతుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T606 చిప్‌సెట్‌లో పని చేస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో ఫోటోగ్రఫీ కోసం ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ ఫేసింగ్ కెమెరాను అందించారు. అదే సమయంలో కంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చింది. ఫోన్‌ను పవర్ చేయడానికి దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. OS గురించి మాట్లాడితే ఫోన్ Android 13 ఆధారంగా XOS13లో పని చేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం,మీరు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని చూడొచ్చు.

Exit mobile version
Skip to toolbar