Site icon Prime9

Xiaomi 14 Civi 5G: లడ్డూ కావాలా నాయనా.. డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. క్లిక్ చేస్తే బొమ్మ అదిరిపోద్ది..!

Xiaomi 14 Civi 5G

Xiaomi 14 Civi 5G

Xiaomi 14 Civi 5G: టెక్ మార్కెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదంటే.. టక్కున చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కో ఫోన్ ఒక్కో ఫీచర్స్‌తో స్పెషల్‌గా ఉంటుంది. అలానే వినియోగదారులు అభిరుచులకు అనుగుణంగా అది మారుతుంటుంది. ఒకరికి పర్ఫామెన్స్ నచ్చితే.. మరొకరికి కెమెరా క్వాలిటీ, ఇంకొకరికి స్టోరేజ్. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు మొబైల్ కొంటుంటారు. అయితే మీరు మంచి సెల్ఫీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకో అదిరిపోయే శుభవార్త ఉంది. ఎందుకంటే నేటి టెక్ ప్రపంచంలో సెల్ఫీలు మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి.

ఇప్పుడు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉత్తమ క్షణాలను క్యాప్చర్ చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. షియోమీ ఇప్పుడు Xiaomi 14 Civi 5G 32 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఫోన్‌ను భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకొంటే ఈ ఫోన్ ధర? ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఈ షియోమీ ఫోన్ 8 GB RAM + 256 GB స్టోరేజ్ ధర  రూ. 40,999. అయితే దీని 12 GB RAM +512 GB స్టోరేజ్ ధర రూ. 46,999. అయితే కస్టమర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సహాయంతో ఫ్లిప్‌కార్ట్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దానిపై 3000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, నో కాస్ట్ EMIలో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.ఈ ఫోన్‌ను హాట్ పింక్, క్రూయిస్ బ్లూ, ఆక్వా బ్లూ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌లో 6.55 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను HDR10+ సపోర్ట్‌తో పరిచయం చేసింది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కంపెనీ Xiaomi 14 CIVI 5Gని రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంచింది. 8GB RAM+ 256GB స్టోరేజ్, 12GB RAM+ 512GB స్టోరేజ్.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ IOS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు ఇది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ ఉన్నాయి. అయితే మీరు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరాను చూస్తారు. ఇది 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో  ఉంటుంది.ఈ ఫోన్ ఆటో ఫోకస్‌తో వస్తుంది. ఫోన్‌లో 47000mAh బ్యాటరీ ఉంది. ఇది USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.

Exit mobile version