5g Mobile @ Rs 931 only: ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ వివో అన్ని విభాగాల్లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తుంది. అలానే ఫోన్లను కొనుగోలు చేసేందుకు మంచి ఆఫర్లను అందిస్తుంది. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ OPPO F27 Pro + 5G ధరను భారీగా తగ్గించింది. డిస్కౌంట్లతో ఈ మొబైల్‌ను ఆర్డర్ చేయచ్చు. బ్రాండ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వాషింగ్ మెషీన్‌లో పడినా పనిచేస్తోంది. అంటే, ఇది వాటర్ ప్రూఫ్‌గా ఉండటంతో పాటు చాలా శక్తివంతమైనది. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OPPO F27 Pro + 5G Discounts
ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ధర గురించి మాట్లాడితే ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వినియోగదారులకు రూ. 32,999కు అందిస్తున్నారు. దీనిని మీరు ఫ్లిప్ కార్ట్ నుండి 42శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత, దాని ధర రూ. 18999 అవుతుంది.
బ్యాంక్ ఆఫర్ కింద, మీకు అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 190 తగ్గింపు ఇస్తున్నారు. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తున్నారు. ఇది మాత్రమే కాదు రూ. 18250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. దీనితో పాటు రూ. 931 EMI ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు.
OPPO F27 Pro + Features
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది2412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాకుండా 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందుబాటులో ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఫోన్‌లో ఉంటుంది.
స్టోరేజ్ విషయానికి వస్తే 8జీబీ ర్యామ్,128జీబీ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. దీని మెయిన్ కెమెరా 64మెగాపిక్సెల్. సెకండరీ కెమెరా 2మెగాపిక్సెల్. అదే సమయంలో సెల్ఫీ కోసం ముందు భాగంలో 8మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పవర్ బ్యాకప్ కోసం 67W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని చూడచ్చు. ఇది ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14 పై నడుస్తుంది. ఇది IP69, IP68, IP66 రెసిస్టెన్స్‌తో వస్తుంది.