Deal Of The Day: ఇన్ఫినిక్స్ కంపెనీ అనేక బ్రహ్మాండమైన ఫోన్లను విడుదల చేసింది. వాటిలో సరికొత్త Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్లో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ మొబైల్‌ని బడ్జెట్ కేటగిరీలో తీసుకొచ్చారు. ప్రస్తుతం Infinix Note 40X 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ Note 40X 5G ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో 36శాతం ప్రత్యక్ష తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 19,999 ధరతో విడుదల చేశారు. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 15,999కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఫోన్‌ను మరింత తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.
ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులపై 1,000 తక్షణ తగ్గింపు ఇస్తున్నారు. అప్పుడు మీరు ఈ మొబైల్‌ని కేవలం రూ.14,999కి ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ ఎలాంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా రూ.4,000 ధరతో లభిస్తుంది. అదనంగా రూ. 10,600 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్ గోల్డ్, బ్లాక్ కలర్స్ లో ఉంది.
Infinix Note 40X 5G Specifications
ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 2436 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Infinix Note 40X 5G మెడిటెక్ డైమెన్షన్ 6300 6nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB, 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా 1 TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
Infinix Note 40X 5G ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.
Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. మొబైల్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఫోన్లో ఫేస్ అన్‌లాక్, జేబీఎల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్ చేశారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి.