Site icon Prime9

Doogee S200 5G: బాహుబలి ఫోన్.. 10,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

Doogee S200 5G

Doogee S200 5G

Doogee S200 5G: టెక్ మేకర్ డూగీ తన తాజా స్మార్ట్‌ఫోన్ డూగీ ఎస్ 200ని అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది ఎస్ సిరీస్‌లో మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్. ఇది రెండు డిస్‌ప్లే‌లతో 10,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ భారీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఉంటుంది. ర్యామ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా, వాటర్‌ప్రూఫ్‌గా కూడా ఉంటుంది. 100 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరాతో ఈ ఫోన్ అనేక మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెల్‌లోని సమాచారం ప్రకారం డూగీ ఎస్200 5జీ కఠినమైన ఫోన్. ఇది 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ మెయిన్ డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌తో స్మార్ట్, పవర్‌ఫుల్ విజువల్స్ అందిస్తుంది. ఇది నోటిఫికేషన్‌లు, ముఖ్యమైన ఫంక్షన్‌లకు క్విక్ యాక్సెస్‌బిలిటీ  కోసం సెకండరీ 1.32 అంగుళాల ఆమ్లోడ్ బ్యాక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిఫరెంట్ లైటింగ్‌లో అద్భుతమైన వ్యూ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్ 6 ఎన్ఎమ్ మెడిటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. గరిష్టంగా 32 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది.

కెమెరా గురించి మాట్లాడితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 100 మెగాపిక్సెల్ AI బెటర్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది క్లియర్, క్వాలిటీ షాట్‌ల కోసం Morpho ఇమేజింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా కూడా ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

ఫోన్‌లో క్లోజ్ అప్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ నీటి అడుగున కూడా ఫోటోగ్రఫీ చేస్తుంది. 5 అడుగుల (1.5 మీటర్లు) లోతులో పనిచేస్తుంది. అంటే అడ్వెంచర్ ఫోటోగ్రఫీకి కూడా ఫోన్ సరైనదని కంపెనీ చెబుతోంది. ఇది హై క్వాలిటీ వీడియోలను క్యాప్చర్ చేయడానికి 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఫోన్ 10,100 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇతర గాడ్జెట్‌లను ఛార్జ్ చేయవచ్చు. డూగీ ఫోన్ బోల్డ్ మెకా-మోటివేటెడ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం బిల్డ్‌ను ఉంది. ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, IP69/IP69K రేటింగ్‌తో వస్తుంది.

కనెక్టివిటీ కోసం ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, GPS, Glonass, Galileo, Beidou వంటి అధునాతన నావిగేషన్ సిస్టమ్‌లు, భద్రత కోసం ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ ఇస్తుంది.  డూగీ S200 గ్రే, సిల్వర్ కలర్స్‌లో వస్తుంది. ఇది అనేక ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంది. అమెజాన్ యూకేలో దీని ధర £259.99. సుమారు రూ. 28,300. ఇందులో £70 డిస్కౌంట్ వోచర్ ఉంటుంది. యూఎస్‌లో, ఇది $90 కూపన్‌తో అమెజాన్‌లో $339.99 (సుమారు రూ. 28,600)కి అందుబాటులో ఉంది.

Exit mobile version