Daam virus: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ మాల్ వేర్ ‘దామ్’తో పెను ముప్పు ఉందని వినియోగదారులను అలెర్ట్ చేసింది. దామ్ వైరస్ తో ఫోన్లలోని సమాచారాన్ని అంతా తన అధీనంలోకి వెళ్తుందని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో మొబైల్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని.. అనవసరమైన లింక్ లను క్లిక్ చేయోద్దని తెలిపింది. అనుమానాస్పద నెంబర్ల నుంచి వచ్చే లింక్ లతో ఈ దామ్ వైరస్ మొబైల్స్ లోకి వచ్చేస్తుంది పేర్కొంది. ఒక సారి వైరస్ ఫోన్ లో ఇన్ స్టాల్ అయితే సెక్యూరిటీ సిస్టమ్ కు కూడా బోల్తాకొట్టిస్తుందని చెప్పింది.
సెక్యూరిటీ వ్యవస్థ ఫెయిల్ అయిన తర్వాత ఫోన్ లోని రీడింగ్ హిస్టరీ, బుక్ మార్క్ తదితర కీలక సమాచారాన్ని దొంగలిస్తుంది. కాల్ డేటా మొత్తాన్ని హ్యాక్ చేస్తుంది. కాల్ రికార్డులు, కాంటాక్ట్స్, హిస్టరీ, కెమెరా ఇలా అన్నింటిని ఆప్ రేట్ చేస్తుంది. సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కూడా చిక్కకుండా .. అందుకు అనుగుణంగా రాన్ సమ్ వేర్ ను డెవలప్ చేసుకునే సామర్థ్యం ఈ మాల్ వేర్ కు ఉందని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జన్సీ టీమ్ పేర్కొంది. వినియోగదారుడి సమాచారమంతా తీసుకున్న తర్వాత దానిని ఎన్ క్రిఫ్ట్ చేసి , ఒరిజనల్ డేటాను డిలీట్ చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన, గుర్తితెలియని నెంబర్ల నుంచి వచ్చిన లింక్ లను క్లిక్ చేయోద్దని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కోరింది.