Poco C75 5G First Sale: పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుండి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ సరసమైన ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 SoC, 120Hz డిస్‌ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే మొదటి సేల్‌లో దానిపై కంపెనీ ఒక గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీరు మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. Poco C75 5G ధర, బ్యాంక్ ఆఫర్‌లు, ఫీచర్లను చూద్దాం.
Poco C75 5G Offers
ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఒకే 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో ఉంది. దీని ధర రూ.7,999. ఇది ఎన్చాన్టెడ్ గ్రీన్, ఆక్వా బ్లూ, సిల్వర్ స్టార్‌డస్ట్ షేడ్స్‌లో వస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. వినియోగదారులు ICICI, HDFC, SBI బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొంవచ్చు. దీని ధర రూ.6,999కి తగ్గుతుంది.
Poco C75 5G Specifications
ఈ సరసమైన ఫోన్‌లో 6.88-అంగుళాల HD+ LCD స్క్రీన్ 600 నిట్‌ల పీక్ బ్రైట్నెస్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
పోకో C75 షియోమి HyperOSలో వస్తున్న మొదటి C సిరీస్ ఫోన్. రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఫోన్ 5160mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేస్తుంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో వెనుకవైపు 50MP సోనీ కెమెరా సెన్సార్, 2MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ మొబైల్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసంIP52 రేటింగ్‌ను పొందింది. మీరు ఈ ఫోన్‌ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే Poco C75 ప్రస్తుతం Jio 5G నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ ఇస్తుందని గుర్తుంచుకోండి.