BSNL 5G and 4G Service Launch Date: దేశీయ ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీ 4జీ, 5జీ సర్వీస్‌ల ప్రారంభ తేదీని ప్రకటించింది. BSNL వచ్చే ఏడాది మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశంలో 4G టెక్నాలజీని అందజేస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీని తర్వాత జూన్ 2025 నాటికి 5G నెట్‌వర్క్‌లోకి రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశం 4Gలో ప్రపంచాన్ని అనుసరిస్తోందని, అయితే 5Gతో వేగాన్ని కొనసాగిస్తోందని సింధియా US-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌లో చెప్పారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో 6Gలో భారతదేశం కూడా ప్రముఖ పాత్ర పోషించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఎవరి డివైజెస్‌లను ఉపయోగించదని చెప్పారు. ఇప్పటివరకు, 38,300 సైట్‌లు ప్రారంభమయ్యాయి. కంపెనీ తన స్వంత 4G నెట్‌వర్క్ ద్వారా జూన్ 2025 నాటికి 5Gకి మారనుంది. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆరో దేశంగా భారత్ అవతరిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ 4G టెక్నాలజీ కోసం ప్రభుత్వ C-DOT, దేశీయ IT కంపెనీ TCS జాయింట్ వెంచర్లు అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. 22 నెలల్లో 4.5 లక్షల టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే 4G నుండి 5G టెక్నాలజీకి అత్యంత వేగంగా మారిందని సింధియా చెప్పారు. BSNL ఇప్పటికే ఉన్న సైట్‌లలో చిన్న మార్పులు, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 5G సర్వీసెస్‌ను ప్రారంభించనుంది.
2025 నాటికి తన కస్టమర్లను 25 శాతం పెంచుకోవాలనేది BSNL లక్ష్యం. BSNL ఆగస్టు 6న ‘ఓవర్-ది-ఎయిర్’ (OTA), యూనివర్సల్ SIM (USIM) ప్లాట్‌ఫామ్‌లను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇది కస్టమర్‌లు మొబైల్ నంబర్‌ను సెలక్ట్ చేసుకోడానికి, SIM మార్చడానికి అనుమతిస్తుంది.
అయితే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎక్కువ రోజుల వాలిడిటీతో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకి మంచి రోజులు వచ్చాయి. అతిపెద్ద టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, విఐ తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఈ కంపెనీల కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది. BSNL గత జూలై, ఆగస్టులలో కేవలం రెండు నెలల్లో 50 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు.