Site icon Prime9

BSNL: దూకుడుపెంచిన BSNL.. రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లు లాంచ్..!

BSNL

BSNL

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్ధ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు సరసమైన ధరలలో అనేక మంచి ప్లాన్లను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ రూ.439, రూ. 1198 రెండు కొత్త ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్లు ఎన్ని రోజుల వాలిడిటీతో వస్తాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

BSNL Rs.1198 Plan
ఈ ప్లాన్‌తో మీకు ఇప్పటికే తెలిసినట్లుగా  12 నెలలు అంటే 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. దీనితో పాటు డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. మీ నెలవారీ ఖర్చు కేవలం రూ. 100 మాత్రమే. ఈ BSNL ప్లాన్ ధర రూ. 1198, దీనిలో మీరు ఏడాది పొడవునా 365 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇది నెలకు 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3GB డేటా, నెలకు 30 SMSలతో వస్తుంది.

అలానే తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి లిమిటెడ్ కాలింగ్,  డేటాను ఒకేసారి ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచిది. ఇందులో 12 నెలల కాలవ్యవధికి మొత్తం రూ.1198 ఖర్చవుతుంది. అంటే మీరు నెలకు రూ. 100 మాత్రమే ఖర్చు చేసి అత్యుత్తమ సేవలను పొందవచ్చు.

BSNL Rs.439 Plan
ఈ రూ. 439 ప్లాన్‌తో మీరు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, మొత్తం 300 SMSలను పొందుతారు. వాలిడిటీ గురించి మాట్లాడితే ఈ రూ. 439 ప్లాన్‌తో మీకు 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపెనీ ఈ ప్లాన్‌తో ఎటువంటి డేటా సౌకర్యాన్ని అందించడం లేదు, అంటే మీరు ఎక్కువ వాలిడిటీతో కాల్స్ చేయాలనుకుంటే, మీరు ఈ ప్లాన్‌ను ఎంచురోవచ్చు.

కాబట్టి మీకు పైన పేర్కొన్న ప్లాన్ మాత్రమే అవసరమైతే ఈ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక. మీ సమాచారం కోసం BSNL అధికారిక సైట్‌లో రీఛార్జ్ చేసుకోవడానికి రెండు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్లాన్‌లలో దేనిలోనైనా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు BSNL అధికారిక సైట్ లేదా కంపెనీ మొబైల్ యాప్‌ని ఉపయోగించచ్చు.

Exit mobile version