Upcoming Smartphones: హిట్టు కొట్టేది ఎవరు.. జనవరిలో వచ్చే ఫోన్లు.. ఏ ఫోన్ కొనాలి..!

Upcoming Smartphones: టెక్ మార్కెట్‌లో పండుగ సీజన్‌లో ఫోన్ల జాతర జరిగిందనే చెప్పాలి. దీపావళి పండుగ సందర్భంగా మొబైల్ మార్కెట్ ఓ వెలుగు వెలిగింది. అయితే ఈ వెలుగులు ఇంకా కొనసాగనున్నాయి. ఎందుకంటే జనవరి నెలలో చాలా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటిలో రియల్‌మి, వన్‌ప్లస్, ఐక్యూ, వివో వంటి బ్రాండ్లు ఉన్నాయి. కొన్ని ఫోన్లు క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తున్నాయి. అలానే ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఇందులోని టెక్నాలజీ మొబైల్ ప్రియులను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది. ఈ ఫోన్ల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుదాం.

OnePlus 13
వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 13ని చైనాలో విడుదల చేసింది. దీనిలో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్. ఇది ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా త్వరలో విడుదల కానుంది. జనవరి 2025లో భారత్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు వేరియంట్‌లలో వస్తుంది. దీని ధర 12GB + 256GB వేరియంట్ CNY 4,499 నుండి ప్రారంభమవుతుంది. అంటే సుమారు రూ. 53,100.  హై-ఎండ్ 24GB + 1TB మోడల్ ధర CNY 5,999 అంటే సుమారు రూ.70,000. ఇది క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది.

ఇది 6.82-అంగుళాల BOE X2 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1440p రిజల్యూషన్, 1-120 Hz నుండి రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. పీక్ బ్రైట్నెస్ 4,500 నిట్‌లు. ఇది పెద్ద వైబ్రేషన్ మోటారును కలిగి ఉంది. ఇది గేమింగ్ కంట్రోలర్‌కు అందించారు. ఫోన్ IP69 రేటింగ్‌ను అందిస్తోంది.

ఫోన్‌లో ప్రైమరీ సోనీ LYT-808 సెన్సార్, 3x పెరిస్కోప్ లెన్స్, అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉన్న హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన ట్రిపుల్ 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో కంపెనీ ఫోటోగ్రఫీపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది.

సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్  ఆండ్రాయిడ్ 15లో ColorOS 15లో రన్ అవుతుంది. గ్లోబల్ మోడల్ ఆక్సిజన్ OS 15ని ఉపయోగిస్తుంది. 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ నేరుగా ఐఫోన్‌తో పోటిపడుతుంది.

iQOO 13
ఐక్యూ 13 చైనాలో లాంచ్ అయింది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌‌తో రన్ అవుతుంది. గరిష్టంగా 16 జీబీ ర్యామ్ + 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఇంటర్నల్ Q2 గేమింగ్ చిప్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 5లో పనిచేస్తుంది. త్వరలో భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు.

చైనాలో ఫోన్ ధర 12GB + 256GB వేరియంట్ కోసం CNY 3,999 (దాదాపు రూ. 47,200), 16GB + 1TB మోడల్ కోసం CNY 5,199 (దాదాపు రూ. 61,400) వరకు ఉంది. ఇది వివో చైనా ఇ-స్టోర్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్, లెజెండరీ ఎడిషన్, నార్డో గ్రే, ట్రాక్ ఎడిషన్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉంది.

ఫోన్ LTPO 2.0 టెక్నాలజీతో 6.82-అంగుళాల 2K BOE Q10 OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌, HDRని కలిగి ఉంది. దీని కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ ఉంది. వెనుక ఎనర్జీ హాలో ఎల్‌ఈడీ లైట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120W వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,150mAh బ్యాటరీ అందించారు.

Realme GT 7 Pro
రియల్‌మి త్వరలో శక్తివంతమైన ఫోన్‌లను కూడా తీసుకువస్తోంది. వీటి ధరలు ఇప్పటికే లీక్ అయ్యాయి. చైనాలో దీని బేస్ మోడల్ ధర CNY 3,999 (సుమారు రూ. 47,100) కావచ్చు. ఈ ఫోన్ నవంబర్‌లో భారతదేశం, చైనా రెండింటిలోనూ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఫోన్ 6.78-అంగుళాల OLED ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 1Hz నుండి 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.  6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, 100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజీతో, డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని అందిస్తుంది.

కెమెరా సెటప్‌లో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 3x జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్, అలాగే 16MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. 120W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 5G ​​సపోర్ట్, Wi-Fi 7 మరిన్నింటితో పెద్ద 6500mAh బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.