Budget Mobile Phones:ప్రస్తుతం మొబైల్ ఫోన్ మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తోంది. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు అంతా మొబైల్‌ఫోన్‌ల ద్వారానే. అలానే కంపెనీలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడి సరికొత్త ఫీచర్లతోకస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ నెలలో మార్కెట్లోకి వచ్చిన బడ్జెట్ మొబైల్ ఫోన్స్‌పై ఒక లుక్కేద్దాం. ఇక్కడ బడ్జెట్ మొబైల్ ఫోన్ అంటే రూ.20వేలు అంత కంటే తక్కువ ధర కలిగినవిగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. వివరాలు చూద్దాం.
వివో T3 5G స్మార్ట్‌ఫోన్‌తో స్పీడ్, ఇన్నోవేషన్, క్రియెటివిటి అన్నీ కలగలిసి ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ బిగించబడింది. 734 ఫ్లస్ స్కోరింగ్ సాధించింది. ఫస్ట్ సోని IMX882 OIS sensor ద్వారా క్లియర్‌గా లో లైట్‌లో కూడా మంచి షాట్‌లను తీసుకోవచ్చు. 16.94 cm (6.67) 120 Hz Ultra Vision AMOLED display.. 5000 mAh battery with 44 W డ్యూయల్ స్టీరియో స్పీకర్ ద్వారా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. ఫ్లాష్‌చార్జ్‌తో ఆడియో వీడియోలను దీర్ఘకాలం పాటు ఆనందించవచ్చు. 4కె వీడియో ద్వారా ప్రతి క్షణాన్ని మీస్మార్ట్ ఫోన్‌లో బంధింవచ్చునని వివో చెబుతోంది.
ది మోటో G64 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే అందుబాటు ధరలో లభిస్తోంది. దీని కంటే హయ్యర్ ఎండ్ వెరియెంట్ అంటే 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ కావాలనుకుంటే దాని ధర రూ.16,000ల వరకు పలుకుతోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తోపాటు మంచి పెర్పార్మెన్స్, కెమెరా, పెద్ద సైజు బ్యాటరీ… వినియోగించడం తేలిక. అతి తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తోంది మోటో జీ 64 మొబైల్ ఫోన్. మార్కెట్లో దీనికి పోటీ రియల్ మీ పీ1. గేమింగ్ ఆడుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇక ది మోటో విషయానికి వస్తే మీ బడ్జెట్‌లో బేసిక్ ఫోన్ కావాలనుకుంటే రూ.14,000 నుంచి రూ.16,000 ధరలో లభిస్తుంది.
POCO X6 5G స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే వివిధ రకాల ఫీచర్లతో పాటు మంచి డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది. మెరుగైన పనితీరుతో పాటు ఫాస్ట్ చార్జింగ్ దీని ప్రత్యేకత. కాగా ఈ ఫోన్‌లో అదనపు ఆకర్షణ విషయానికి వస్తే న్యూ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఓఐసీ సపోర్ట్ కలిగి ఉన్నాయి. మొత్తానికి చూస్తే మీరు నో నాన్సెన్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్‌ను ఎంచుకోవచ్చునని నిపుణులు సలహా ఇస్తున్నారు. షామి రెడ్‌మీ నోట్ 13 విషయానికి వస్తే ధీని ధర రూ.16,999 నుంచి రూ.17,999 వరకు ఉంది. ఈ బడ్జెట్‌లో అత్యధునిక డిజైన్ , వైబ్రెంట్ డిస్‌ప్లేతో పాటు దీర్ఘకాలం మన్నె బ్యాటరీతో పాటు ఫాస్ట్ చార్జింగ్ అవుతుంది. కెమెరాకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సాధారణ వినియోగానికి దీనికంటే మంచి ఫోన్ లేదని చెబుతున్నారు నిపుణులు.