ASUS ROG Phone 9: ఆసుస్ వచ్చేస్తోంది.. పవర్ ఫుల్ ఫీచర్లతో రెండు కొత్త ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే?

ASUS ROG Phone 9: ఆసుస్ త్వరలో తన ASUS ROG ఫోన్ 9 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రెండు కొత్త మొబైల్స్ లాంచ్ కానున్నాయి. కంపెనీ ASUS ROG ఫోన్ 9, ASUS ROG ఫోన్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది. SUS ROG ఫోన్ 9 సిరీస్‌ను నవంబర్ 19న విడుదల చేయనుంది. రోగ్ ఫోన్ 9 సిరీస్ రిఫ్రెష్ రేట్ 185Hz ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని అందిస్తున్నారు. రండి ఈ కొత్త ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కంపెనీ ASUS ROG ఫోన్ 9 సిరీస్‌ను నవంబర్ 19న విడుదల చేయనుంది. ఇందులో కొత్త క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్‌లు 185Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. తాజాగా ఈ ఫోన్ డిజైన్, ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఒక టిప్‌స్టర్ ఆసుస్ రోగ్ ఫోన్ 9 మొబైల్  కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు.

నివేదిక ప్రకారం Asus రోగ్ ఫోన్ 9 సిరీస్ రిఫ్రెష్ రేట్ 185Hz ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని అందిస్తున్నారు. 185Hz రిఫ్రెష్ రేట్ గేమ్ జెనీ మోడ్‌కు పరిమితం చేశారు. Asus రోగ్ ఫోన్ 8 సిరీస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గేమింగ్ సమయంలో 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. రెండు ఫోన్లు కూడా AI ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఆసుస్ రోగ్ ఫోన్ 9, ఆసుస్ రోగ్ ఫోన్ 9 ప్రో మొబైల్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇది 1 నుండి 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, సిస్టమ్ సెట్టింగ్‌లలో 165Hz రిఫ్రెష్ రేట్ లేదా గేమ్ జెనీ మోడ్‌లో 185Hz వరకు అప్‌స్కేలింగ్, 2500 nits పీక్ బ్రైట్నెస్. అదనంగా విక్టస్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ ఉంటుంది.

ప్రాసెసర్  విషయానికి వస్తే ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోయే రెండు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విడుదల చేయనుంది. ఈ సిరీస్ రేంజ్ 24GB RAM+ 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ROG UI,  గేమ్ జెనీపై రన్ అవుతాయి.

ఆసుస్ రోగ్ ఫోన్ 9 సిరీస్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ లిటియా 700 ప్రైమరీ కెమెరా ఉంటుంది. అదనంగా 13-మెగాపిక్సెల్ 120-డిగ్రీ అల్ట్రావైడ్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా,  32-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం రెండు ఫోన్‌లలో 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రోగ్ ఫోన్ 9 సిరీస్‌లో కంపెనీ 5800mAh కెపాసిటీ బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఆసుస్ రాగ్ ఫోన్ 9 సిరీస్ అత్యుత్తమ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.