Site icon Prime9

Nothing Phone 2a: ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్.. నథింగ్ ఫోన్ 2ఎపై బిగ్గెస్ట్ డిస్కౌంట్..!

Nothing Phone 2a

Nothing Phone 2a

Nothing Phone 2a: దీపావళి పండుగలో భాగంగా ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్‌లపై ఉత్తమ తగ్గింపులను ఇస్తుంది. వాటిలో నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్‌‌పై బెస్ట్ డీల్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను అందుబాటులో ఉంది. దీని మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్. ఫోన్ లాంచ్  ధరపై 15 శాతం ప్రత్యక్ష తగ్గింపు ఇస్తుంది. ఇప్పుడు 21,999 రూపాయలకు ఆర్డర్ చేయచ్చు.  అదనంగా, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి కూడా డిస్కౌంట్లను పొందవచ్చు.

అలాగే నథింగ్ కంపెనీకి చెందిన ఈ ఫోన్ 5,000 mAh కెపాసిటీ గల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ కెపాసిటీ. మొబైల్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,080 x 2,412 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ సామర్థ్యం గల AMOLED డిస్‌ప్లే. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 30Hz నుండి 120Hz, పిక్సెల్ సాంద్రత 394ppi,  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్. HDR10+ సపోర్ట్ ఉంది. ఇది గరిష్టంగా 1,300 నిట్స్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.

నథింగ్ ఫోన్ 2a మొబైల్ ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 7200 Pro SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది నథింగ్ ఓఎస్ 2.5 సపోర్ట్ ఆధారంగా ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఇందులో మూడేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. 12GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరజ్ ఉంది.

నథింగ్ ఫోన్ 2a మొబైల్ 50 మెగా పిక్సెల్ సెన్సార్ కెపాసిటీ కలిగిన ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. అలాగే సెకండరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్‌. ఇందులో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా కూడా ఉంది. నథింగ్ ఫోన్ 2a మొబైల్ 5,000 mAh బ్యాటరీ బ్యాకప్‌ను పొందుతుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 డైరెక్ట్, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version